పల్లెకు పండగేదీ!
ABN, Publish Date - Mar 03 , 2025 | 12:15 AM
పల్లె పండగ పేరుతో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అనేక పనులు అప్పుడే నీరసించాయి. బిల్లులు రాకపోవడంతో రెండు నెలలుగా ఎక్కడివి అక్కడే అన్నట్టు ఈసురోమంటున్నాయి.
ఇప్పటికే నీరసించిన పనులు
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి
రూ.147 కోట్లు పెండింగ్
సీసీ రోడ్లవే రూ.110 కోట్లు
అసంపూర్తిగా గోకులాలు
పూర్తికాని డ్రెయినేజీల నిర్మాణం
ఎక్కడి పనులు అక్కడే
కాంట్రాక్టర్ల లబోదిబో
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
పల్లె పండగ పేరుతో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అనేక పనులు అప్పుడే నీరసించాయి. బిల్లులు రాకపోవడంతో రెండు నెలలుగా ఎక్కడివి అక్కడే అన్నట్టు ఈసురోమంటున్నాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి సంబంధించి బిల్లులు ఆలస్యం అవడంతో పలు చోట్ల వీటిని కాంట్రా క్టర్లు నిలిపివేశారు. బిల్లులు వచ్చాక తిరిగి చేద్దా మనే ధోరణితో మధ్యలోనే వదిలేశారు. అటు గోకులాల షెడ్లను తొలుత సొంత నిధులతో ప్రా రంభించిన రైతులు సైతం బిల్లులు రాక లబో దిబోమంటున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లా లోనే సుమారు రూ.4 కోట్ల వరకూ బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లా వ్యాప్తంగా రూ.147 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రూ.110 కోట్లకుపైగా బకాయిలు సీసీ రోడ్లవే కాగా మిగిలినవి గోకులాల షెడ్ల బాకీలున్నాయి. అయితే బకాయిల్లో కేంద్రం నుంచి సగా నికిపైగా, మిగిలినవి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ నుంచి విడుదల కావాల్సి ఉన్నాయి. మరో పక్క రైతులు ముందుకురాని చోట్ల కాంట్రాక్టర్లు నిర్మించిన గోకులాల షెడ్లలో అప్పుడే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి.
రూ.147 కోట్లు బకాయి
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పరిధిలో కొత్తగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం గతేడాది అక్టోబరు 14 నుం చి పల్లె పండగ పేరుతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఉపాధి హామీ పథకానికి సం బంధించి మెటీరియల్ కాంపోనెంట్, ఆర్థిక సం ఘం నిధుల ద్వారా బిల్లులు చెల్లించే విధంగా పనులకు జిల్లాల వారీగా అధికారులు ప్రతిపాద నలు సిద్ధం చేశారు. గ్రామాల్లో ఎక్క డెక్కడ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు అవసరమో గుర్తించి వాటిని నిర్మించడానికి వీలుగా అంచ నాలు సిద్ధం చేశారు. రైతుల కోసం గోకులాల షెడ్లను ఈ పథకంలో చేర్చారు. సీసీ రహదారులు, డ్రె యిన్లు, గోకులాల షెడ్లకు సంబంధించి కాకినాడ జిల్లాలో మొత్తం రూ.180 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.38 కోట్ల బిల్లులు చెల్లించారు. కానీ పూర్తయిన, మధ్యలో కొనసాగుతున్న పనులకు సంబంధించి ఇంకా రూ.42 కోట్ల వరకు బకా యిలు పేరుకుపోయాయి. డిసెంబరు నెలాఖరు వరకు ఠంఛనుగా వచ్చిన బిల్లులు ఆ తర్వాత నుంచీ పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా అనేక పనులను అటు కాంట్రాక్టర్లు, ఇటు రైతు లు నిలిపివేశారు. బిల్లులు వస్తేనే తిరిగి చేయ గలమంటూ అధికా రులకు తెగేసి చెప్పేశారు. మరో పక్క బిల్లులు రాకపోవడంతో రూ.102 కోట్లకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న పలు పనులపైనా ప్రభావం పడింది. అనేక చోట్ల కాంట్రాక్టర్లు వీటిని మధ్యలో నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 650 సీసీ రహ దారు లు, 675 గోకులాల షెడ్లను ఈ పథకం కింద ప్రారంభించారు.ఇప్పటి వరకు కొన్ని బిల్లులు చెల్లింపులు జరగ్గా, ఇంకా రూ.65 కోట్ల వరకు బాకీలు పేరుకుపోయాయి.ఇందులో రూ.4 కోట్ల వరకు గోకులాల షెడ్లకు సంబం ధించిన బిల్లు లుండగా,మిగిలిన రూ.61 కోట్లు సీసీ రహదారు లవే ఉన్నాయి.అటు అంబేడ్కర్ కోనసీమ జిల్లా లోను రూ.40 కోట్ల వరకు బిల్లులు పేరుకు పోయాయి. సింహభాగం సీసీ రహదారులవే. మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.147 కోట్లు బకాయిలుగా తేలాయి.ఇవి రాక అనేక పనులపై ప్రభావం పడింది.
వచ్చాక చూద్దాం..
వాస్తవానికి రెండునెలలుగా అధికారులు అది గోఇదిగో అంటున్నా బిల్లులు రాకపోవడంతో అటు కాంట్రాక్టర్లు, ఇటు రైతులు పనులను మధ్యలో ఆపేశారు. సీసీ రహదారులకు సంబం ధించి ఒక్కో పనిని రూ.3 లక్షల వరకు విభ జించి నామినేషన్ ప్రాతిపదికపై కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరంతా చిన్నాచితకా కాంట్రా క్టర్లు కావడంతో బిల్లులు రాక పనులు చేయ లేమని తెగేసి చెప్పేస్తున్నారు. కొందరైతే ప్రా రంభించినవి మధ్యలో ఆపేయగా, మరికొం దరు బిల్లులు వస్తేనే పని మొదలుపెడతామని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి పల్లె పండ గకు పనులకు సంబంధించి ఉపాధి హామీ పనుల ద్వారా సమకూరే మెటీరియల్ కాం పోనెంట్ నిధులను వెచ్చిస్తున్నారు. ఈ నిధులు 75 శాతం కేంద్రం, మిగిలిన 25 శాతం రాష్ట్రప్ర భుత్వం నుంచి రావాల్సి ఉంది. అయితే ప్రస్తు తం ఆర్థికంగా అనేక ఇబ్బందులున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడానికి కొంత జాప్యమవుతోంది. కాగా ఉమ్మడి జిల్లా లో పలుచోట్ల గోకులాల షెడ్లను ముందుగా తమ సొంత నిధులతో నిర్మించుకోలేని రైతుల కోసం అధికారులే కొందరు కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులు చేయి ంచారు. వీటిలో చాలా వరకు నాణ్యతా లోపాలు బయటపడు తుండడం విశేషం.
Updated Date - Mar 03 , 2025 | 12:15 AM