కొల్లగొట్టింది.. కోట్లలోనే..
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:41 AM
జిల్లాలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగి పోతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా నేరగాళ్లు అమాయకులపై వలవేసి నిలువునా దోచుకుపో తున్నారు. అవగాహన లేక జనం సైతం నేరగా ళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపో తున్నారు. దీంతో ఏటా ఈ కేసులు అమాంతం పెరిగిపో తున్నాయి.
జిల్లాలో సైబర్ టెర్రర్: అంతకంతకూ పెరిగిపోతున్న నేరాలు
గతేడాది జిల్లాలో రూ.26.57కోట్లు కొల్లగొట్టేసిన నేరగాళ్లు
మోసపోయిన బాధితులు 2,672మంది: కేవలం 55 నేరాలపైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ఏడాది వ్యవధిలో మూడురెట్లకుపైగా పెరిగిన మోసాలు
2023లో జిల్లాలో సైబర్ నేరాల్లో జనం పాగొట్టుకున్న సొమ్ము రూ.8.32కోట్లు
అమాయకుల నుంచి చదువుకున్న వారి వరకు టార్గెట్
సైబర్ నేరాలపై అవగాహన పూర్తిగా లేక మోసపోతున్న జనం
ఖాతాలో డబ్బులు పోయిన కొన్ని గంటల్లో ఫిర్యాదు చేస్తేనే ఫలితం
జిల్లాలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగి పోతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా నేరగాళ్లు అమాయకులపై వలవేసి నిలువునా దోచుకుపో తున్నారు. అవగాహన లేక జనం సైతం నేరగా ళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపో తున్నారు. దీంతో ఏటా ఈ కేసులు అమాంతం పెరిగిపో తున్నాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు అమయాక జనం నుంచి కొల్లగొ ట్టింది లక్షా, రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.26.57కోట్లు. ఒకరకంగా ఆశ్చర్యపో యేలా ఈస్థాయిలో నేరాలు పెరిగిపోతుండడం పోలీసులను సైతం కలవరపెడుతోంది.
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
2023తో పోల్చితే ఏడాది తిరిగే సరికి జిల్లాలో సైబర్ మోసాల కేసులు, బాధితులు సైతం వందల నుంచి వేలల్లోకి పెరగడం ఆందోళనకర అంశం. అంతేకాదు.. జనం సైతం పోగొట్టుకున్న సొమ్ము కూడా ఏకంగా మూడు రెట్లు పెరిగి పోవడం ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్లు జిల్లాపై పంజా విసురుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా సైబర్ నేరాల కింద ఫోన్‌కు వచ్చిన అనుమానిత లింక్ ఓపెన్ చేస్తేనో, ఓటీపీ చెబితేనో నేరగాళ్లు వేలల్లో కొల్లగొట్టేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా రూటు మార్చి వీడియో కాల్స్ చేస్తూ అరెస్ట్‌ల పేరుతో బెదిరించి కోట్లకు కోట్లు కొట్టేస్తుండడం పెరిగిపోయిన నేరాల తీవ్రతను చాటుతోంది. ఇటీవల పెద్దాపురంలో ఓ బడా రైతు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏకంగా రూ.కోటి కొట్టేయడం ఇందుకు నిలు వెత్తు నిదర్శనం.
సైబర్ అరాచకం..
ఉన్నట్టుండి మన ఫోన్‌కు ఓ కాల్ వస్తుంది.. మీ ఆధార్ నెంబర్ ఫలానా నేరం జరిగిన చోట దొరికింది. మీ పేరు.. ఊరు.. ఫలానా అంటూ ఎదుటి వ్యక్తి బెదిరిస్తాడు. అర్జంట్‌గా వాట్సాప్ వీడియో కాల్‌లోకి రమ్మని హెచ్చరిస్తారు.. తీరా వెనుక పోలీస్‌స్టేషన్ సెటప్. ఖాకీ దుస్తులో నేరగాడు. అర్జంట్‌గా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ బెదిరిస్తారు. ఈలోపు ఎదు టి వ్యక్తి భయాన్ని గమనించి అరెస్ట్ లేకుండా ఉండాలంటే లక్షల్లో ఇవ్వాలని హెచ్చరిస్తారు. అదంతా మోసం అని గమనించలేక భయంతో అనేక మంది నేరగాళ్లు చెప్పిన ఖాతాకు డబ్బు లు బదిలీ చేస్తూ మోసపోతున్నారు. ఇలా వం దలాదిమంది జిల్లాలో గడచిన ఏడాది కాలంలో కోట్లకు కోట్లు పాగొట్టుకున్నారు. అర్జంట్‌గా డబ్బులు కావాలి అంటూ కలెక్టర్ లేదా ఇతర ప్రముఖుల పేర్లతో ఫోన్‌లు చేయడం, వాట్సాప్ మెసేజ్‌లు పంపి డబ్బులు వసూలు చేసిన ఘటనలు సైతం జిల్లాలో తరచూ జరుగుతు న్నాయి. నిందితులు జిల్లాలో ఇద్దరు గత కలెక్టర్ల పేర్లను, ఫొటోలను సైతం వాడేశారు. కొందరు నేరగాళ్ల ఉచ్చును గమనించక ఫోన్‌పేలు, గూగుల్ పేలో డబ్బులు పంపిస్తూ మోసానికి గురవుతున్నారు. ఇలా ఇప్పటివరకు గతేడాది జి ల్లాలో వేలాది మంది మోసపోయారు. కొంద రైతే బయటకు చెబితే పరువు పోతుందనే భ యంతో బయటపడడం లేదు. మరికొందరైతే ఆ లస్యంగా తేరుకుని పోలీసులకు ఫోన్‌లు చేస్తు న్నా నిందితులను పట్టుకోవడం అసాధ్యంగా మారుతోంది. మోసపోయిన కొద్ది సమయంలోనే పోలీసులను ఆశ్రయిస్తే ఎంతో కొంత ఫలితం ఉండే అవకాశం ఉన్నా జనం మాత్రం ఈ విషయంలో అవగాహన లేక నష్టపోతున్నారు.
పెద్దాపురం ఘటనలో..
ఇటీవల పెద్దాపురంలో ఓ రైతును సైబర్ నేరగాళ్లు భయపెట్టి రూ.కోటి వరకు కాజేశారు. పోలీసులను ఆశ్రయించడంతో వాట్సాప్ కాల్స్, చాట్ ద్వారా నిందితులను ఢిల్లీ వెళ్లి పట్టుకున్నా రు. కానీ డబ్బుల రికవరీ జరగలేదు. వాస్తవా నికి ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేయడం, ఓటీపీ చెప్పడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్న కొన్ని కేసుల్లో మాత్రం నగదు రికవరీ జరుగు తోంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న తర్వాత పోయిన డబ్బు రావడం అసాధ్యంగా మారుతోంది. పోలీసులు సైతం సాంకేతికంగా వేగంగా కదిలే పరిస్థితి లేకపోవడం, నిందితులు సైతం ఎక్కడెక్కడి నుంచో మోసాలకు పాల్పడు తుండడం కేసులను చేధించడానికి వీలు కుదర డంలేదు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతు న్నా రికవరీ కష్టంగా మారుతోంది. జిల్లాలో గతే డాది వేలాదిమంది ఇలా సైబర్ నేరగాళ్లలో వల లో చిక్కుకుని మోసపోయారు. కానీ పోయిన డబ్బు రాదనే నైరాశ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కొందరు ఫిర్యాదు చేస్తున్నా ఆధారాలు లేకపోవ డంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు కట్టలేని పరిస్థితి.
ఏడాదిలో మూడు రెట్లు దోచేశారు..
జిల్లాలో 2024లో మొత్తం 2,672మంది తాము సైబర్ నేరానికి గురైనట్లు పోలీసులను ఆశ్రయించారు. అందే 2023లో అయితే 1,854 మంది బాధితులు పోలీసుల వద్దకు వచ్చారు. కానీ వీరిలో 80శాతం మంది డబ్బులు పోగొ ట్టుకున్నామని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ మోసం చేసిన వ్యక్తికి సంబంధించి కనీస ఆధారాలు ఇవ్వలేకపోయారు. అటు సమయానికి రాకుం డా చాలా కాలం తర్వాత మోసానికి గురయ్యా మంటూ వచ్చిన వారే అధికం. దీంతో పోలీసు లు వీటిపై కేసులు నమోదు చేయలేదు. పోలీసులను ఆశ్రయించిన వేలాది మందిలో గతేడాది 55 నేరాలకు సంబంధించి మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి గతేడాది జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం రూ.26.57కోట్లు. ఇందులో పోలీసులు 5శాతం కూడా రికవరీ చేయలేని పరిస్థితి. ఇదే 2023లో అయితే 39 కేసులు నమోదు చేయగా, ఇందులో జనం పోగొట్టుకున్న సొమ్ము రూ.8.32కోట్లు. అంటే అంతకుముందు ఏడాదితో పోల్చితే ఒక్క ఏడా దిలో సైబర్ నేరగాళ్లు జిల్లాలో మూడురెట్లు అధికమొత్తంలో డబ్బులు కొల్లగొట్టేశారు. కాగా ఇటీవల కాలంలో సైబర్ నేరాల తీవ్రత పెరగడం, కేసులు కూడా అధికంగా వస్తుండడంతో కూటమి ప్రభుత్వం జిల్లాకో సైబర్ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. దీంతో బాధితులకు కొంత వరకు న్యాయం జరిగే అవకాశం ఏర్పడనుంది.
Updated Date - Jan 19 , 2025 | 12:41 AM