కొత్తిమీర కిలో రూ.5
ABN, Publish Date - Feb 02 , 2025 | 12:03 AM
కూరల్లో కరివేపాకుతో పాటు కొత్తి మీర వేస్తే ఆ రుచే వేరు. చేపల పులుసులో కొత్తిమీర లేకుండా ఆ కూరను ఊహించలేము. అంతటి ప్రాధాన్యం, డిమాండ్ ఉన్న కొత్తిమీరకు గడ్డుకాలం వచ్చిం ది. పంట వేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఆవేద వ్యక్తం చేస్తు న్నారు.
గిట్టుబాటు కాని ధరలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాగుదారులు
కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన
పంటను తీసేసేందుకు కలుపు మందు కొడుతున్న రైతన్నలు
పెరవలి, ఫిబ్రవరి 1(ఆంరఽధజ్యోతి): కూరల్లో కరివేపాకుతో పాటు కొత్తి మీర వేస్తే ఆ రుచే వేరు. చేపల పులుసులో కొత్తిమీర లేకుండా ఆ కూరను ఊహించలేము. అంతటి ప్రాధాన్యం, డిమాండ్ ఉన్న కొత్తిమీరకు గడ్డుకాలం వచ్చిం ది. పంట వేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఆవేద వ్యక్తం చేస్తు న్నారు. కొత్తిమీరను కూలీలతో పీకించి మా ర్కెట్‌కు తరలిస్తున్నామని, కనీసం కూలి డబ్బు లు కూడా రావడం లేదని, ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని రైతులు అంటున్నారు. కొత్తి మీరకు నెల క్రితం ఉన్న డిమాండ్ ప్రస్తుతం లేదని, రెండు నెలల క్రితం ఎకరం పొలంలో కొత్తిమీర రూ.లక్ష ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.5 వేలు రావడంలో లేదని వాపోతున్నారు. కిలో కొత్తిమీర రూ.5 ధర పలుకుతుందని చెబుతున్నారు. సంవ త్సరం పొడవునా కొత్తి మీర పండదు. చల్లటి వాతావరణం ఉన్న సమయంలోనే కొత్తిమీర వే స్తారు. ఖాళీ అయిన చేలల్లో పంటను వేస్తున్నారు. ఏప్రిల్, మేలలో కొత్తి మీర రాదు. అయితే గతంలో కొత్తిమీరకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది పంట వేశారు. పంట వేసిన 40 రోజుల్లో చేతి కొస్తుంది. ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేలు ఖర్చు అవుతుందని, అయితే ప్రస్తుతం కూలి ఖర్చులు కూడా రావడం లేదని చెబుతున్నారు. కిలో రూ.20 పైనే ఉంటే గిట్టుబాటు అవుతుం దని, అయితే ప్రస్తుతం రూ.5 మాత్రమే ఉందని చెబుతున్నారు. కొత్తిమీర పంట పెట్టుబడి, కూలి, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను తీసేస్తున్నారు. కొత్తి మీర గుబాలింపు రావాల్సిన ప్రదేశంలో కలుపు మం దు వాసన వస్తోంది. ఎక్కువ మంది కొత్తిమీర వైపు మొగ్గు చూడకుండా వేరే కాయగూరలు వేయాలని సూచిస్తున్నారు.
Updated Date - Feb 02 , 2025 | 12:03 AM