చికెన్ తిందాం.. రా
ABN, Publish Date - Mar 02 , 2025 | 01:39 AM
చికెన్ లేదా.. నాకు అన్నం వద్దంటూ మారాం చేయని పిల్లలు అరుదు. నాకు లెగ్ పీస్ కావాలమ్మా అంటూ ముందే రిజర్వు చేసుకునే టీనేజర్లు.. చికెన్ ఫ్రై చేయనా, కర్రీనా అంటూ కిచెన్‌లోంచే ఆఫర్ ఇచ్చే ఇల్లాలు.. ఈలోగా హోటల్‌కెళ్లి దమ్ బిర్యానీ తిందామా అంటూ ఇంటాయన బంపర్ ఆఫర్. ఆదివారం వచ్చిందంటే.. మాంసాహారం తినే వారి ప్రతి ఇంట్లో ఓ చికెన్ మేళానే. పండగన్నా, ఫంక్షనన్నా చికెన్ వెరైటీస్‌తో మరో మెగా మేళా. బలం కోసం గుడ్లు తినండి.. ఓ సలహా. పౌష్ఠికాహారంలో గడ్డుదే తొలి మెనూ. ఒక్కే ఒక్క భయం అన్నిటినీ దూరం చేసేసింది.
ఊరూవాడా పౌలీ్ట్ర రంగం ప్రచారం
బర్డ్‌ఫ్లూతో కోట్లతో నష్టపోయిన పరిశ్రమ
ఉచిత మేళాలు గట్టెక్కిస్తాయనే ఆశలు
కోలుకుంటేనే అనుబంధ వ్యాపారాలకూ జోరు
ప్రస్తుతానికి మటన్, చేపలు, రొయ్యలదే హవా
వేడుకల్లో ‘మటన్’ మెనూతో పెనుభారం
చికెన్ ఉంటేనే నాన్‌వెజ్ ప్రియులకు పండగ
చికెన్ లేదా.. నాకు అన్నం వద్దంటూ మారాం చేయని పిల్లలు అరుదు. నాకు లెగ్ పీస్ కావాలమ్మా అంటూ ముందే రిజర్వు చేసుకునే టీనేజర్లు.. చికెన్ ఫ్రై చేయనా, కర్రీనా అంటూ కిచెన్‌లోంచే ఆఫర్ ఇచ్చే ఇల్లాలు.. ఈలోగా హోటల్‌కెళ్లి దమ్ బిర్యానీ తిందామా అంటూ ఇంటాయన బంపర్ ఆఫర్. ఆదివారం వచ్చిందంటే.. మాంసాహారం తినే వారి ప్రతి ఇంట్లో ఓ చికెన్ మేళానే. పండగన్నా, ఫంక్షనన్నా చికెన్ వెరైటీస్‌తో మరో మెగా మేళా. బలం కోసం గుడ్లు తినండి.. ఓ సలహా. పౌష్ఠికాహారంలో గడ్డుదే తొలి మెనూ. ఒక్కే ఒక్క భయం అన్నిటినీ దూరం చేసేసింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో కోడిమాంసం, గుడ్లు వ్యాపారాన్ని కుప్పకూలేలా చేసింది. వైరస్‌తో కోళ్లు చనిపోయిన మాట వాస్తవం. కానీ దాని ప్రభావం మనుషులపై చూపలేదు. కేవలం భయాందోళనే చికెన్‌ను దెబ్బతీసింది. నెలరోజుల్లో కోట్లలో వ్యాపారం దెబ్బతింది. ఇప్పుడిప్పుడే మళ్లీ జనం చికెన్ వైపు మళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పరిశ్రమ కూడా ఉచిత చికెన్ మేళాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక పట్టణాల్లో విస్తృత ప్రచారం చేసింది. మరి ఈ ఆదివారం ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.
(అమలాపురం/అనపర్తి/పిఠాపురం/మండపేట/కొవ్వూరు-ఆంధ్రజ్యోతి)
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రచారంతో దాదాపు నెల రోజులపాటు కోడిమాంసం, గుడ్లు వ్యాపారం పడిపోయింది. అధికారులు, వైద్యులు, పరిశ్ర మకు చెందినవారు ఎంత అవగాహన కల్పిం చినా జనం చికెన్ తినేందుకు ఇష్టపడలేదు. కనీ సం గుడ్లు తినాలన్నా భయపడే రోజులు కొన సాగాయి. ఇది పౌలీ్ట్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ. కేవలం భయాందోళన వల్ల జరిగిన భారీ నష్ట మిది. పేదవర్గాలు సైతం కోడిమాంసం తినేం దుకు ముందుకు రాలేదంటే దాని ప్రభావం ఏమేరకు చూపిందో అర్థం చేసుకోవచ్చు. తూ ర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలం బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు పెద్దఎత్తున చనిపోవ డం తో ఈ విషయం తొలుత బయటకొచ్చింది. ఆ తర్వాత ఈ జిల్లాలో మరికొన్ని ఫౌలీ్ట్ర ఫారాల్లో నూ బర్డ్‌ఫ్లూ లక్షణాలతో కోళ్లు చనిపోవడంతో వెంటనే కోడిమాంసం, గుడ్లు తినొద్దంటూ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాకినాడ జిల్లాలో కూడా కొన్నిచోట్ల ఇదే పరిస్థితి తలెత్తడంతో కాకినాడ జిల్లాతోపాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లాలోనూ కొంతకాలం చికెన్ తినొద్దం టూ కలెక్టర్లు ఆదేశించారు. ఇందులో కోనసీమ జిల్లాలో ఈ ప్రభావంతో చనిపోయిన కోళ్లు పెద్దగా లేవు. అలాగే ఈ మూడు జిల్లాల్లో పౌలీ్ట్ర ల్లో పనిచేసే కూలీలకు శ్వాబ్ పరీక్షలు చేస్తే ఏ ఒక్కరికీ బర్డ్‌ఫ్లూ లక్షణాలు సోకలేదు. దీంతో వెంటనే కోడిమాంసం, గుడ్లు తినొచ్చంటూ అధి కారులు, వైద్యులు చెబుతూ వచ్చారు. కానీ జనం మాత్రం చికెన్ అంటే భయపడుతూనే వచ్చారు. పౌలీ్ట్ర పరిశ్రమ పెద్దలు కూడా రం గంలోకి దిగి ఉచిత చికెన్ మేళాలు నిర్వహించి ప్రచారం చేశారు. ఆయా కార్యక్రమాలకు జన స్పందన కూడా బావుంది. చికెన్, గుడ్ల కోసం అన్నిచోట్లా పెద్దఎత్తున జనం ఎగబడ్డారు. ఈ అవగాహన ఎంతవరకు ఫలిస్తుందో, దాని ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచిచూడాలి.
చికెన్ షాపులు వెలవెల
బర్డ్‌ఫ్లూ ఎఫెక్టుతో చాలా చికెన్ షాపులు మూతపడ్డాయి. గత వారం నుంచే చాలామంది చికెన్ దుకాణాల్లో ఓమోస్తరుగా అమ్మకాలు చేస్తున్నారు. కొవ్వూరు పట్టణంలో సాధారణంగా 15 రోజుల్లో పది వేల కోళ్లు విక్రయించేవాడు. గత పక్షం రోజుల్లో కేవలం 500 కోళ్లను మాత్రమే విక్రయించాడంటే చికెన్ అమ్మకాలు ఏ స్థాయిలో పడిపోయాయో అర్థంచేసుకోవచ్చు. పిఠాపురంలో మరో చికెన్ షాపు నిర్వాహకుడు మాట్లాడుతూ తాను ఆదివారం నాడు 2వేల కిలోల వరకూ అమ్మేవాడినని, అది వంద కిలోలకు పడిపోయిందని వాపోయాడు. అలాగే కిలో చికెన్ స్కిన్‌లెస్ నెల కిందట రూ.220 వరకు విక్రయించగా, ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 మధ్య అమ్ముతున్నారు. అయినాగానీ అమ్మకాలు అంతంత మాత్రమే.
ఫంక్షన్లలో మటన్ మెనూలు
బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ విక్రయాలు తగ్గిఅంతా మటన్, చేపలు, రొయ్యలు, పీతల వంటి వాటిపై పడ్డారు. ఫలితంగా వాటి ధరలు పెరిగిపోయాయి. మటన్ కిలో రూ.800 ఉండే ధర రూ.వెయ్యికి, కొన్నిచోట్ల రూ.1100 వరకు పెరిగిపోయింది. చేపలు, రొయ్యల ధరలూ అదేవిధంగా పెరిగిపోయాయి. ఇది పెళ్లిళ్ల సీజన్. వివాహ రిసెప్షన్‌లు ఉంటే నాన్‌వెజ్‌తోనే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఇతర ఫంక్షన్ల లోనూ నాన్‌వెజ్ వంటకాలే ఉంటున్నాయి. వీటి అన్నిటిపైనా చికెన్ ప్రభావం పడింది. ఆయా వేడుకల మెనూలో చికెన్‌ను కొందరు నామ మాత్రంగా పెడితే, కొందరు పూర్తిగా మటన్, చేపలు, రొయ్యల వంటకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వెళ్లిన వారు కూడా మటన్‌పైనే మక్కువ చూపడంతో ఆమేరకు తగిన పరిమాణంలో సిద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో ఆయా వేడుకల ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇది ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుంది.
పుట్టగొడుగులకూ డిమాండే
అమలాపురం రూరల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగదారులు తగ్గిపోయారు. మార్కెట్‌లో ఉదయం వేలాడదీసిన కోళ్ల అమ్మకాలు రాత్రి అయినా పూర్తికాని పరిస్థితి. మార్కెట్‌లో ప్రస్తుతం చేపలు, మటన్ అమ్మకాలు పెరిగినమాట వాస్తవమే. గోదావరి, సముద్రపు చేపల ధరలతోపాటు మటన్ రేటు కూడా పెరిగిపోవడంతో అందరూ కొనుగోలు చేయ లేని పరిస్థితి. దీంతో మాంసాహార ప్రియులుతక్కువ ధరకు దొరికే మష్రూమ్స్ (పుట్టగొడుగులు) లేదా పన్నీర్ వంటకాలపై దృష్టి సారించారు. మార్కెట్‌లో పన్నీర్ రూ.90 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. మష్రూమ్స్ ప్యాకెట్ రిటైల్‌గా రూ.20కే దొరుకుతుండడంతో మాంసాహార ప్రియులు తమ వంటకంగా పుట్టగొడుగులను ఎంచుకున్నారు. ఈ రెండు వంటకాలు వేటికవే ప్రత్యేకం కావడంతో ఆదివారం తక్కువ ఽ ఖర్చుతోనే విందు చేసుకుంటున్నారు.
హోటళ్లలో బెటర్.. పాస్ట్‌ఫుడ్‌లన్నీ మటాష్
సాధారణంగా హోటల్ ఫుడ్ ఇష్టపడేవారంతా చికెన్‌తో పదుల సంఖ్యలో చేసే వెరైటీల కోసమే వెళ తారు. బిర్యానీల్లోనూ ఎన్నో వెరైటీలు. బర్డ్‌ఫ్లూతో చికెన్ వంటకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే చికెన్ బిర్యానీలు, వంటకాలకు కాస్త గిరాకీ తగులు తోందని, అది కూడా నాణ్యతలో పేరున్న హోటళ్లకే పరిమితమని ఒక హోటల్ నిర్వాహకుడు తెలిపాడు. కేవలం చికెన్, గుడ్లతోనే పాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తా యి. అవన్నీ నెలరోజులుగా బేరం లేక మూలనపడ్డాయి. బహుశా వారం పదిరోజుల్లో సాధారణ స్థితి నెల కొంటుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
గుడ్డిలో మెల్ల... గుడ్డు ధర
బర్డ్‌ప్లూ ప్రభావంతో కోళ్ల పరిశ్రమ అతలాకుతలం అవుతున్న తరుణంలో గుడ్ల ఎగుమతులపై తొలుత ప్రభావంపడినా మెల్లమెల్లగా ఎగుమతులు ఊపందుకున్నాయి. నెలరోజుల కిందట రూ.4 దిగువకు చేరుకున్న గుడ్డు ఽధర ప్రస్తుతం రూ.4.80కు చేరుకోవడంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కోళ్లకు నష్టం లేకపోయినా వినియోగం తగ్గడంతో తీసేయాల్సిన లేయర్ బ్యాచ్‌లు బయటకు వెళ్లక రైతులపై భారం పడుతోంది.
చికెన్ మేళాలు ఉపకరిస్తాయా..
కోడిమాంసం కూర గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఉడికించి తింటే ఒకవేళ వైరస్ లక్షణాలు ఉన్నా ఏమీ కాదని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు కూడా పూర్తిగా ఉడక బెట్టుకుని లేదా వండుకుని తినొచ్చని చెప్పారు. పౌలీ్ట్ర సంఘాలు కూడా రంగంలోకి దిగి ఉచిత చికెన్, గుడ్లు మేళాలు నిర్వహించగా, జనం వాటి కోసం పెద్దఎత్తున ఎగబడ్డారు. ఇది పూర్తి సానుకూల పరిస్థితి ఉంటుందనే ఆశాభావంతో వారంతా ఉన్నారు.
Updated Date - Mar 02 , 2025 | 01:40 AM