ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రీ సర్వే విధుల్లో నిర్లక్ష్యం.. కలెక్టర్‌ కొరడా

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:40 AM

పనిచేయని ఉద్యోగులపై కలెక్టర్‌ పి.ప్రశాంతి కొరడా ఝుళిపిం చారు.విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కలెక్టర్‌ ప్రశాంతి

12 మంది డిప్యూటీ తహశీల్దార్లు

12 మంది మండల సర్వేయర్లు

ఇద్దరు గ్రామ సర్వేయర్లు

వివరణకు కలెక్టర్‌ ఆదేశాలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : పనిచేయని ఉద్యోగులపై కలెక్టర్‌ పి.ప్రశాంతి కొరడా ఝుళిపిం చారు.విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.వీరిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రకియ్రను నిర్ధిష్టమైన మార్గదర్శకాలు అనుసరించి చేయాలి. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీ సులు జారీ చేశారు.ఈ మేరకు పెరవలి, గోపాలపురం, రాజమహేంద్రవరం రూరల్‌, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు చెందిన 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 12 మంది మండల సర్వే యర్లకు నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. విధులు, బాధ్యతలు నిర్వర్తించ డంలో విఫలమయ్యారని, రీ సర్వే సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారుల సూచనలు పాటించక పోవడం తదితర కారణాలతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గ్రామ సర్వేయర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం లేదని.. వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాజానగరం మండలం యర్రం పాలెం సర్వేయర్‌ వి.రమేష్‌కు మార్‌, కానవరం సర్వే యర్‌ వై.నాగరాజుకు షోకాజ్‌ నోటీ సులు ఇచ్చారు.రమేష్‌ కుమార్‌ లాగిన్‌లో ఐదు పౌరసేవలు, గంగరాజు లాగిన్‌లో నాలుగు పౌర సేవలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి జిల్లా పురోగతి మొత్తం మీద ప్రభావం చూపాయని అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌కు లోబడి వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Feb 09 , 2025 | 12:40 AM