ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్య చర్యలకు 860 మంది సిబ్బంది

ABN, Publish Date - Feb 02 , 2025 | 12:24 AM

ఈ నెల 4 నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్య చర్యలపై ప్రత్యేకంగా 860 మంది సిబ్బందిని నియమించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి తెలిపారు.

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 4 నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్య చర్యలపై ప్రత్యేకంగా 860 మంది సిబ్బందిని నియమించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి తెలిపారు. పారిశుధ్య కార్మికుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లను నియమించామన్నారు. జిల్లాకు సంబంధించి 307 మంది స్వీపర్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 75 మందితో కలిపి 382 మంది పారిశుధ్య కార్మికులను అంతర్వేది ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నియమించామన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు 18 మంది ఈవోపీఆర్డీలు, 66 మంది పంచాయతీ కార్యదర్శులు, 12 మంది జూనియర్‌ అసిస్టెంట్లను నియమించామన్నారు. ఎక్కడికక్కడ బృందాలుగా వీరిని నియమించామన్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణంతో పాటు 8వ తేదీ తీర్థం, రథోత్సవాన్ని పురస్కరించుకుని పారిశుధ్య పనులకు ఏర్పాట్లు చేశామన్నారు.

అమలాపురం డిపో నుంచి

34 ఆర్టీసీ బస్సులు..

అంతర్వేది కల్యాణోత్సవాలను పురస్కరించుకుని అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి 34 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. అమలాపురం నుంచి 30 బస్సులు, పల్లం నుంచి ప్రత్యేకంగా నాలుగు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మలికిపురం సెంటర్‌ వరకు మాత్రమే బస్సులు వెళతాయని అక్కడి నుంచి రాజోలు డిపోకు చెందిన బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రధానంగా అంతర్వేది ఉత్సవాలకు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం బస్‌ డిపోలతో పాటు అమలాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏటా ఏర్పాటు చేస్తుంటారు. గతంలో నేరుగా అంతర్వేది దేవస్థానం వరకు బస్సులు నడిపేవారు. అయితే సింగిల్‌ రోడ్డు కావడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇతర డిపోలకు చెందిన బస్సు సర్వీసులను మలికిపురం సెంటర్‌కు మాత్రమే పరిమితం చేశారు. సఖినేటిపల్లి రేవు నుంచి రాజోలు డిపోకు చెందిన బస్సులు గొంది రోడ్డు మీదుగా అంతర్వేది దేవస్థానానికి వెళ్లే విధంగా, మలికిపురం నుంచి దేవస్థానానికి చేరుకునేలా బస్సు సదుపాయాలు కల్పించారు.

Updated Date - Feb 02 , 2025 | 12:24 AM