ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంస్కృతి, సంప్రదాయాల కలయికే సంక్రాంతి

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:43 AM

దేశ సంస్కృతి, సంప్రదాయాల చిహ్నమే సంక్రాంతి అని వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేపీ రాజు పేర్కొన్నారు.

కొత్తపేట, జనవరి 8(ఆంధ్రజ్యోతి): దేశ సంస్కృతి, సంప్రదాయాల చిహ్నమే సంక్రాంతి అని వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేపీ రాజు పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని రంగవల్లుల పోటీలు నిర్వహించగా, ఈ పోటీల్లో విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో రంగవల్లులు వేశారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ కె.సత్యనారాయణ, సీహెచ్‌ నాగారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆలమూరు: తక్కువ ఎత్తుతో పుట్టి రికార్డు సృష్టించిన పుంగనూరు దూడ మండపేటలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆకర్షణగా నిలిచింది. మండపేట మున్సిపాల్టీలో బుధవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆలమూరు మండలం గుమ్మిలేరు రైతు రెడ్డి వీరవెంకటసత్యనారాయణకు చెందిన పుం గనూరు దూడను తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నూకదుర్గారాణి, మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌తోపాటు పలువురు నాయకులు రైతు సత్తిబాబును అభినందించారు.

రావులపాలెం: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు రంగోలి, మ్యూజికల్‌ చైర్‌ తదితర పోటీలు జరిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి ఎస్‌.అరుణ్‌కుమార్‌, అధ్యా పకులు బీపీఎన్‌ రెడ్డి, హరిబాబు, రజని, సుమలత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

కృత్తివెంటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో

రామచంద్రపురం(ద్రాక్షారామ): కృత్తివెంటి పేర్రాజు పంతులు విద్యా సంస్థలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రామచంద్రపురం పాన్‌షాపు అసోసియేషన్‌, వేమగిరి కోకోకోలా బాట్లింగ్‌ యూనిట్‌ సౌజన్యంతో విద్యార్థులకు ముగ్గుల పోటీలు జరిపారు. పూర్వ విద్యార్థి గొర్రెల శ్రీనివాస్‌ హరిదాసు వేషధారణతో అలరించారు. విద్యార్థులు ఆటపాటలతో సం క్రాంతి వేడుకలు జరిపారు. ముగ్గుల పోటీల విజేతలకు మంత్రి సుభాష్‌ తండ్రి సత్యం బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్‌ గంగరాజు, హెచ్‌ఎం వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:43 AM