బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఫిక్కి నాగేంద్ర
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:01 AM
ఏ రాజకీయపార్టీకైనా సంస్థాగతపరమైన బలం.. ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళతామనేది ప్రధానంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్ర వరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ఇతర పార్టీలకంటే బీజేపీ భిన్నమైనది
పార్టీ కోసం కష్టపడితే ఉన్నత పదవులు
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఏ రాజకీయపార్టీకైనా సంస్థాగతపరమైన బలం.. ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళతామనేది ప్రధానంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్ర వరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన అధ్యక్షుడిని ప్రకటించారు. కొవ్వూరుకు చెందిన ఫిక్కి నాగేంద్ర జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిని ఏకాభ్రిపాయంతో ఎన్నుకున్నామన్నారు. ఇతర పార్టీలకంటే బీజేపీ భిన్నమైనది అని.. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే సాధారణ కార్యకర్తలు ఏ స్థాయికైనా సరే ఎదిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అవ్వాలని ఆశించవచ్చని కానీ అందరికీ అవకాశం ఉండదన్నారు. ఆశించిన వారు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు. పోటీ ఎన్నికల వరకూ మాత్రమే పరిమితం చేయాలన్నారు. నీ వర్గం, నా వర్గం అని భావించకూడదన్నారు. రాజమహేంద్రవరం జిల్లాలో లక్ష పైబడి సభ్యత్వాలు నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 22 , 2025 | 01:01 AM