ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం పదిలమే...

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:13 AM

పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుందని మంత్రి సుభాష్‌ అన్నారు.

రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుందని మంత్రి సుభాష్‌ అన్నారు. శనివారం రామచంద్రపురంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌లో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుంచి రాజగోపాల్‌ సెంటర్‌ వరకు అవగాహన ర్యాలీ జరిపారు. ర్యాలీ అనంతరం మానవహారం చేశారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి స్వర్ణా ంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవరకొండ అఖిల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యప్పనాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, పారిశ్రామికవేత్త అడ్డూరి జగన్నాధవర్మ, టీడీపీ నాయకులు అక్కల రిష్వంత్‌రాయ్‌, పెంకె సాంబశివరావు, మాజీ కౌన్సిలరు అల్లం శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్‌సీసీ విద్యార్థులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

మండపేట: పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అ న్నారు. మండపేటలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌లో భాగంగా మున్సిపల్‌ కార్యాల యం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆయ న ప్రారంభించి పాల్గొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుంచి కేపీరోడ్డు మీదుగా రథం గుడి వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ పి.నూక దుర్గారాణి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, తూర్పుకాపు కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గడి సత్యవతి, మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మందపల్లి చంద్రశేఖర్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మండపేట రూరల్‌లో: ద్వారపూడిలో పంచా యతీ కార్యదర్శి ఆకులు వీ.వీరమణ ఆధ్వర్యం లో స్వచ్ఛతహిసేవలో భాగంగా గ్రామంలో సచివాలయ ఉద్యోగులు, శానీటరి సిబ్బంది, కూటమి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు యరగతపు బాబ్జి, గోణం పుల్లయ్య, సచివాలయ ఉద్యోగులతోపాటు ఎంపీడీవో సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అర్తమూరులో జరిగిన ర్యాలీలో సర్పంచ్‌ గోలుగూరి అన్నపూర్ణ, ఉపసర్పంచ్‌ కర్రి జంబయ్యరెడ్డి, గ్రంథాలయ మాజీ అధ్య క్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీడీవో పాల్గొన్నారు. ఏడిదలో జరిగిన ర్యాలీలో సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం, ఈవో పీఆర్‌డీ దాసరి శ్రీనువాస రావు, కార్యదర్శి పి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొ న్నారు. తాపేశ్వరం, కేశవరం, పాలతోడు, వెలగ తోడు, వై.సీతానగరం, మారేడుబాక, ద్వార పూడి, జెడ్‌.మేడపాడు తదితర గ్రామాల్లో ర్యాలీలు జరిపారు.

కె.గంగవరం: మండలంలోని గ్రామాల్లో శని వారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ కార్యక్ర మాలు జరిపారు. సచివాలయ సిబ్బంది పారి శుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామా ల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్య దర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రాయవరం: పరిసరాల శుభ్రతకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీడీవో ఎన్‌.కీర్తి స్పం దన అన్నారు. శనివారం రాయవరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, వెలుగు ఏపీయం నాగేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

ఆత్రేయపురం: మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ నిర్వహించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ ఎన్వీ రామారావు, ఎంపీడీవో వెంకటరామన్‌ ఆధ్వ ర్యంలో దీన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గెడ్డం సుధ, ఏవో రామస్వరూప్‌, ఎంఈవోలు ప్రసాద్‌, సాహేబ్‌ తదితరులు పాల్గొనగా 17 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.

ద్రాక్షారామ: రామచంద్రపురం మండలంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాలు జరిగాయి. మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో షట్లర్‌ రాజు ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి చాగంటి సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. ద్రాక్షారామ పంచాయతీలో సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మానవహారం చేశారు. ముందుగా ర్యాలీ జరిపారు. వెంకటాయపాలెం సర్పంచ్‌ యల్లమిల్లి సతీష్‌కుమారి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ జరిపారు. ఆలయంలో పారిశుధ్య కార్యక్రమాలు జరపగా, ఆలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తపేట: ఏపీని దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్రత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛదివస్‌లో భాగంగా రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మానవహారం జరిపారు. కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్‌, కంఠంశెట్టి శ్రీనివాస్‌, బూసి జయలక్ష్మి, వాసంశెట్టి సత్యనారాయణ, విళ్ళ మారుతీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 01:13 AM