ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీ పిల్లలకు, గర్భిణీలకు పోషక ఆహారం : కలెక్టర్‌ ప్రశాంతి

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:42 AM

జిల్లాలో అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. గురువారం దేవరపల్లి మండలంలోని దేవర పల్లి, చిన్నాయిగూడెం, యర్నగూడెం అంగ న్వాడీ కేంద్రాలను సందర్శించి సాక్షం పథకం కింద వర్షపునీటి నిల్వలు, మరుగుదొడ్ల నిర్మాణం, పోషణ వాటికలు, ఆర్వో ప్లాంట్‌ ద్వారా తాగునీటి సరఫరా పనులను ఆమె పరిశీలించారు.

దేవరపల్లిలో గురువారం గర్భిణీలకు ఆకుకూరలు అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

దేవరపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. గురువారం దేవరపల్లి మండలంలోని దేవర పల్లి, చిన్నాయిగూడెం, యర్నగూడెం అంగ న్వాడీ కేంద్రాలను సందర్శించి సాక్షం పథకం కింద వర్షపునీటి నిల్వలు, మరుగుదొడ్ల నిర్మాణం, పోషణ వాటికలు, ఆర్వో ప్లాంట్‌ ద్వారా తాగునీటి సరఫరా పనులను ఆమె పరిశీలించారు. దేవరపల్లిలో అంగన్వాడీ భవ నం చుట్టూ గ్రీన్‌క్లాత్‌ ఏర్పాటు చేయాలన్నా రు. గర్భిణీల కోసం పోషక వాటికలను ప్రత్యే కంగా పెంచడం ద్వారా గర్భిణీలకు పోషకా హారం అందుతుందన్నారు. జిల్లాలో 173 అంగన్వాడీ కేంద్రాలున్నాయని.. అన్ని అంగ న్వాడీ కేంద్రాల్లోనూ అన్ని వసతులు కల్పించ డానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింద న్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భి ణీలు, బాలింతలు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా ప్రచారం నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందిస్తున్న వివిధ పథకాలను అంగన్వా డీ కార్యకర్తలు ప్రచారం ద్వారా అవగాహన చేయాలన్నారు. యాదవోలులో రూ.40 లక్షల వ్యయంతో జడ్పీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ఆమె పరశీలించారు. గర్భిణీలకు ఆకు కూరలు అందజేశారు. ఆకుకూర విత్తనాలు కలెక్టర్‌ చల్లారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమశాఖాధికారి విజయకుమారి, డ్వామా పీడీ నాగమహేశ్వరరావు,ఆర్‌డబ్ల్యూఎస్‌ పీడీ పీవీ గిరి, తహశీల్దార్‌ రాజ్యలక్ష్మి, సర్పంచ్‌లు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 01:42 AM