ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఎంసీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

ABN, Publish Date - Jan 24 , 2025 | 12:26 AM

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని (ఏఎంసీ) చైర్మన్‌ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 9 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.

మండపేట జనవరి 23(ఆంధ్రజ్యోతి) రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని (ఏఎంసీ) చైర్మన్‌ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 9 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. జనరల్‌కు 50 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 4 శాతం చొప్పన రిజర్వేషన్లను కేటాయించారు. జిల్లాలో ఉన్న 9 కమిటీల్లో సగం మహిళలకు దక్కనున్నాయి. ఇప్పటికే పదవుల కోసం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. జిల్లాలో మార్కెట్‌ యార్డులకు సంబంధించి చైర్మన్‌ పదవులు రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట బీసీ జనరల్‌, ముమ్మిడివరం ఓసీ జనరల్‌, అల్లవరం ఓసీ జనరల్‌ మహిళ, రాజోలు బీసీ మహిళ, కొత్తపేట బీసీ జనరల్‌, నగరం, ఎస్సీ మహిళ, ఆలమూరు ఓసీ మహిళ, రామచంద్రపురం, ఓసీ జనరల్‌, అంబాజీపేట ఓసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఆశించే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆశావహులు జాబితాలు సిద్ధం చేయగా ప్రస్తుతం రిజర్వేషన్‌ అమలు కావటంతో జాబితాలు మారే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jan 24 , 2025 | 12:26 AM