ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వా(హ్‌)ట్సాప్‌.!

ABN, Publish Date - Mar 06 , 2025 | 01:40 AM

అమలాపురం రూరల్‌/కాకినాడ రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కల్పించింది

తొలిసారిగా పదో తరగతి హాల్‌ టిక్కెట్లు వాట్సాప్‌ ద్వారా డౌన్లోడ్‌

అమలాపురం రూరల్‌/కాకినాడ రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కల్పించింది. గతేడాది వరకు విద్యార్థుల హాల్‌టిక్కెట్లు తపాలాశాఖ ద్వారా ఆయా పాఠశాలలకు బట్వాడా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా సెల్‌ఫోన్‌లోనే హాల్‌ టిక్కెట్‌ డౌన్లోడ్‌ చేసుకునే సదుపాయం ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీంబాషా, కాకినాడ జిల్లా డీఈవో పి.రమేష్‌ తెలిపారు. వాట్సాప్‌, మన మిత్ర ద్వారా విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా డౌన్లోడ్‌ చేసుకోవాలి?

విద్యార్థులు సెల్‌ఫోన్‌ ద్వారా 9552300009 నంబరుకు హాయ్‌ అనే సందేశాన్ని పంపితే సేవను ఎంచుకోండి అని వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఎడ్యుకేషన్‌ సర్వీసు లేదా విద్యాసేవలు ఎంచుకోండని వస్తుంది. అక్కడ ఎస్‌ఎస్‌సీ హాల్‌ టిక్కెట్‌ అని నమోదు చేసి అప్లికేషన్‌ నంబరు, విద్యార్థి గుర్తింపు నంబరు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను నమోదు చేసి స్ర్టీమ్‌ను సెలెక్ట్‌ చేయాలి. అనంతరం కన్ఫర్మ్‌ మీద క్లిక్‌ చేస్తే హాల్‌ టిక్కెట్‌ను వాట్సాప్‌ వస్తుంది. అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్‌ చేసుకున్న హాల్‌ టిక్కెట్‌లో విద్యార్థి పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫోటోగ్రాఫ్‌ సంతకం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని డీఈవోలు పేర్కొన్నారు. హాల్‌ టిక్కెట్‌ వివరాల్లో ఏదైనా మార్పు ఉంటే వెంటనే ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం పంపించాలని తెలిపారు. డౌన్‌లోడ్‌ అయిన హాల్‌ టికెట్‌లో విద్యార్థి వివరాలన్నింటినీ పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఛీజీటచిజౌఠ్ఛ్ఠ్చిఝటఃడ్చజిౌౌ.ఛిౌఝకు ఈ- మెయిల్‌ ద్వారా పంపించాలని సూచించారు.

Updated Date - Mar 06 , 2025 | 01:40 AM