ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇరిగేషన ఎస్‌ఈగా ద్వారకనాథ్‌ రెడ్డి

ABN, Publish Date - Jan 24 , 2025 | 11:36 PM

జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈగా ద్వారకనాథ్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన ఇరిగేషన సర్కిల్‌ ఎస్‌ఈ ద్వారకనాథ్‌ రెడ్డి

కర్నూలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈగా ద్వారకనాథ్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఎఫ్‌ఏసీ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న జలవనరుల శాఖలో ఈఈలకు ఎస్‌ఈ పదోన్నతి ఇస్తూ బదిలీలు చేపట్టింది. అందులో భాగంగా కడప జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టు డీఎస్‌ఈగా పని చేస్తున్న ద్వారకనాథ్‌ రెడ్డికి ఎస్‌ఈగా పదోన్నతి ఇస్తూ కర్నూలు ఎస్‌ఈగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఇనచార్జి ఎస్‌ఈగా కొనసాగుతున్న బి. బాలచంద్రారెడ్డి అదే కార్యాలయంలో డీఎస్‌ఈగా కొనసాగుతారు. కర్నూలు ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన ద్వారకనాథ్‌ రెడ్డి స్వస్థలం అనంతపురం. ఆయన అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కాలం పని చేశారు. తొలిసారిగా కర్నూలుకు బదిలీపై వచ్చారు. ఏప్రిల్‌ నెలలో ఆయన రిటైర్‌ అవుతారు. అంటే ఈ పదవిలో మూడు నెలలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. ఎస్‌ఈ ద్వారకనాథ్‌ రెడ్డిని పలువురు ఇంజనీర్లు, కార్యాలయ సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం ఆయన ఇరిగేషన ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jan 24 , 2025 | 11:36 PM