ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారీగా తగ్గిన దిగుబడి

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:39 PM

ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే అన్న దాతలకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో న ష్టాలను చవి చూస్తున్నారు.

రహదారిపై మినుములను ఆరబెడుతున్న మహిళా రైతులు

- ఎకరాకు క్వింటా మాత్రమే..

- తెగుళ్లు, అధిక వర్షాలే

కారణమంటూ ఆవేదన

- గిట్టుబాటు ధర లేక మినుము

రైతులు విలవిల

చాగలమర్రి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే అన్న దాతలకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో న ష్టాలను చవి చూస్తున్నారు. నెల తిరగక ముం దే మూడు తుఫానలు రావడంతో అన్నదాత కుదేలయ్యాడు. మండలంలో మినుము పంట ను రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. 90 రోజుల పాటు పంటను కంటికి రెప్పలా కాపా డుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి భారీ గా తగ్గిపోయింది. ఒక్కో క్క రైతు రెండుసార్లు మినుము విత్తనం వేశా రు. ఎకరాకు రూ.20వేల నుంచి రూ.40 వేలు పె ట్టుబడి పెట్టారు. దిగుబ డి మాత్రం ఎకరాకు క్వింటా నుంచి రెండు క్వింటాళ్లు మాత్ర మే వ చ్చిందని లబోదిబోమం టున్నారు. ధర కూడా త గ్గిపోవడంతో రైతులు ఆ వేదన చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మి నుము ధర రూ.9 వేలు నుంచి రూ.12 వేలు దాక పలికిందని, ఈ ఏడాది రూ. ఐదు వేలు నుంచి రూ. ఆరు వేలు దాక తగ్గింది. మినుములు కూడా నాసి రకంగా ఉన్నాయని, వ్యాపారులు కొనడం లే దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు మిను ము పంటను కోత కొయ్య కుండానే వదిలేశారు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండ గా క్వింటా దిగుబడి మాత్రమే రావడంతో రైతులు లబోది బోమంటున్నారు. తెగుళ్లు, అధిక వర్షాలతో మి నుము పంట దెబ్బతిని భారీ నష్టం మిగిల్చిం దని రైతులు విలపించారు. పండిన పంటకు ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:39 PM