ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న కష్టాలు!

ABN, Publish Date - Feb 05 , 2025 | 01:08 AM

గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పన్నెండు అడుగుల వెడల్పుతో సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని డబుల్‌లేన్‌ రోడ్డుగా మార్పు చేస్తామని ఐదేళ్ల కిందట హామీ ఇచ్చి టెండర్లు పిలిచారు. అయినా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే జలమయం అయ్యేది. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియనిస్థితిలోనే ప్రయాణించారు. వర్సిటీలో చదివే విద్యార్థులు, ఉద్యోగులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వణికిపోయారు. రెండేళ్ల కిందట పీజీ కోర్సు చదుతున్న చల్లపల్లికి చెందిన విద్యార్థి ఒకరు ద్విచక్రవాహనంపై వస్తూ, వెనుక వస్తున్న లారీని తప్పించుకునే ప్రయత్నంలో గొయ్యిలోకి వాహనం వెళ్లి కిందపడి గాయాలపాలై మరణించాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివగంగ సెంటరు నుంచి కోన గ్రామం వరకు రూ.5 కోట్లతో సింగిల్‌ రహదారిగా అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు.

- కృష్ణా యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు గుంతలమయం

- గతంలో రూ.10 కోట్లతో డబుల్‌లేన్‌గా వేసేందుకు పిలిచిన టెండర్లు రద్దు

- తాజాగా శివగంగ నుంచి కోన వరకు రోడ్డు అభివృద్ధికి రూ.5 కోట్లతో టెండర్లు ఖరారు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పన్నెండు అడుగుల వెడల్పుతో సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని డబుల్‌లేన్‌ రోడ్డుగా మార్పు చేస్తామని ఐదేళ్ల కిందట హామీ ఇచ్చి టెండర్లు పిలిచారు. అయినా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే జలమయం అయ్యేది. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియనిస్థితిలోనే ప్రయాణించారు. వర్సిటీలో చదివే విద్యార్థులు, ఉద్యోగులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వణికిపోయారు. రెండేళ్ల కిందట పీజీ కోర్సు చదుతున్న చల్లపల్లికి చెందిన విద్యార్థి ఒకరు ద్విచక్రవాహనంపై వస్తూ, వెనుక వస్తున్న లారీని తప్పించుకునే ప్రయత్నంలో గొయ్యిలోకి వాహనం వెళ్లి కిందపడి గాయాలపాలై మరణించాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివగంగ సెంటరు నుంచి కోన గ్రామం వరకు రూ.5 కోట్లతో సింగిల్‌ రహదారిగా అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు.

ఇన్నాళ్లూ మరమ్మతులతో సరిపెట్టారు

ఐదేళ్ల కిందట వీసీ, ప్రొఫెసర్లు కృష్ణా యూనివర్సిటీ వరకైనా రహదారిని అభివృద్ధి చేయాలని అప్పటి మంత్రి పేర్ని నానికి వినతిపత్రాలు అందజేశారు. శివగంగ సెంటరు సమీపంలోని మంగలేరు వంతెన నుంచి యూనివర్సిటీ వరకు 2,100 మీటర్ల మేర డబుల్‌లేన్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని పేర్నినాని హామీ ఇచ్చారు. ఈ రహదారి నిర్మాణానికి సర్వే చేసి రూ.10 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచినా ఈ రహదారి పనులు మాత్రం ప్రారంభించలేదు. ఈ టెండర్లు రద్దు కావడంతో సింగిల్‌ రహదారిగానే అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం టెండర్లు ఖరారయ్యాయి. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవాల సమయంలో ప్రముఖులు వచ్చినపుడు తాత్కాలికంగా ఈ రహదారికి మరమ్మతులు చేసి సరిపెట్టారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం కౌంటింగ్‌ ప్రక్రియ యూనివర్సిటీలోనే జరిగింది. అప్పట్లో ఈ రహదారికి మొక్కుబడిగా మరమ్మతులు చేసి సరిపెట్టారు. ఇటీవల కాలంలో పలుమార్లు కలెక్టర్‌ యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీకి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయిస్తామని చెప్పారు. ఎట్టకేలకు ఈ రహదారికి టెండర్లు పిలిచారు.

ఒక్కటే రోడ్డు కావడంతో..

మచిలీపట్నం-కోన రహదారి వెంబడి కోన, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, పోలాటితిప్ప, కొనకళ్ల గణపతినగర్‌ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ రహదారి ఒక్కటే మార్గం. వేలాది మంది ప్రజలు ఈ గ్రామాల నుంచి నిత్యం ఈ రహదారి గుండానే రాకపోకలు సాగించాలి. కృష్ణా యూనివర్సిటీ, రుద్రవరం గురుకుల జూనియర్‌ కళాశాలకు వెళ్లాలన్నా ఇదొక్కటే మార్గం. యూనివర్సిటి విద్యార్థులు వెయ్యి మంది, ప్రొఫెసర్లు, సిబ్బంది 200 మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి వెంబడి ఆయా గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులున్నాయి. వీటి నుంచి వందలాది టన్నుల మత్స్యసంపద నిత్యం ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రహదారిని పూర్తిస్థాయిలో త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 05 , 2025 | 01:08 AM