ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGP : మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు

ABN, Publish Date - Jan 30 , 2025 | 04:03 AM

రాష్ట్రవ్యాప్తంగా మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు అమర్చాలని ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పోలీసింగ్‌ విభాగాలను డీజీపీ ప్రారంభించారు.

దేశంలోనే మొదటిసారిగా పల్నాడులో డిజిటల్‌ బారికేడింగ్‌: డీజీపీ

నరసరావుపేట లీగల్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు అమర్చాలని ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పోలీసింగ్‌ విభాగాలను డీజీపీ ప్రారంభించారు. ‘నేరం జరిగిన తర్వాత దాన్ని ఛేదించడం కాదు. నేరం చేయాలంటే నేరగాళ్లలో భయం ఏర్పడేలా నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ బారికేడింగ్‌ను పల్నాడు జిల్లాలో పెట్టాం. సైబర్‌ నేరాలను నియంత్రించడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం’ అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్‌ అరుణ్‌బాబు, జేసీ సూరజ్‌ గనోరే పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:03 AM