CRDA : సీఆర్‌డీఏకు రండి!
ABN, Publish Date - Jan 19 , 2025 | 06:03 AM
రాజధానిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ(సీఆర్‌డీఏ) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో
డిప్యుటేషన్‌పై పనిచేయండి
పీఎ్‌సయూలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఆర్‌డీఏ ఆహ్వానం
మూడు నోటిఫికేషన్లు విడుదల
విజయవాడ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాజధానిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ(సీఆర్‌డీఏ) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. దీనికోసం శనివారం సీఆర్‌డీఏ 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇంజనీరింగ్ విభాగంలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈ)ల వరకు మొత్తం 114 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే ఇదే విభాగంలో విడిగా మరో 8 పోస్టులను డిప్యుటేషన్ విధానంలో తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పర్యావరణ విభాగంలో పనిచేసేందుకు కూడా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అకౌంట్స్ విభాగంలో 25 పోస్టులకు సంబంధించి డిప్యుటేషన్ విధానంలో తీసుకునేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Updated Date - Jan 19 , 2025 | 06:03 AM