ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ASP Vijaypal: విజయ్‌ పాల్‌కు బెయిలు

ABN, Publish Date - Feb 13 , 2025 | 04:33 AM

ఈ మేరకు బుధవారం రెండో జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి నాగరాజా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రూ.50 వేల పూచీకత్తుతో, ఇద్దరు షూరిటీ ఇవ్వాలని ఆదేశించారు.

ఒంగోలు క్రైం, గుంటూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో నాలుగో నిందితుడైన నాటి సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌ విజయ్‌పాల్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రెండో జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి నాగరాజా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రూ.50 వేల పూచీకత్తుతో, ఇద్దరు షూరిటీ ఇవ్వాలని ఆదేశించారు. అంతేగాక ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య సంబంధిత కేసు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. విచారణ అధికారికి సహకరించాలని ఆదేశించారు. అంతేగాక కేసులో సాక్షులను ప్రభావితం చేయడం గానీ, వారిని బెదిరించడం గాని చేయరాదని స్పష్టం చేశారు. కోర్టు అనుమతి లేకుండా కేసు తేలే వరకు దేశం విడిచి వెళ్లరాదని కూడా షరతు విధించారు.


టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్‌

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుమారు 45 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి పార్థసారథి బుధవారం ఉత్తర్వులిచ్చారు.

మరోసారి పోలీసు కస్టడీకి తులసిబాబు

రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో 6వ నిందితుడుగా ఉన్న కామేపల్లి తులసిబాబును మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈమేరకు న్యాయమూర్తి ఒకరోజు అనుమతి ఇచ్చారు. గురువారం తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించి శుక్రవారం తిరిగి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:33 AM