ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేవతలారా రండి..

ABN, Publish Date - Feb 19 , 2025 | 11:10 PM

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

ప్రధాన ఆలయంలో ధ్వజపటం ఆవిష్కరణ

శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వైభవంగా ధ్వజారోహణ

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున పట్టువస్త్రాల సమర్పణ

నేడు స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ

శ్రీశైలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 1న ముగియనున్నాయి. బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగమశాస్త్రానుసారం బ్రహ్మోత్సవ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించి శివసంకల్పం చేశారు. బ్రహ్మోత్సవాల సృష్టికర్త బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివ పరివార దేవతలలో ఒకరైన చంఢీశ్వరునికి ప్రతేకంగా పూజాధికాలు జరిపారు. ఉత్సవాలను తెలియజేసేలా ప్రధాన ధ్వజస్తంభం వద్ద ప్రతేక పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా స్వామిఅమ్మవార్లకు పట్టు వసా్త్రలు సమర్పిస్తారన్నారు. అలాగే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 26వ తేదీన స్వామి,అమ్మవార్ల దర్శనార్థం వస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాళహస్తి నుంచి పట్టువసా్త్రలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు బుధవారం రాత్రి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాలను సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవస్ధానం తరపున డిప్యూటీ ఈఓ ఎన.ఆర్‌.కృష్ణారెడ్డి, ప్రధానార్చకులు సంబంధం గురుకుల్‌ పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఈవో ఎం. శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను అలరించాయి. నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగణంలో సంప్రదాయ నృత్యప్రదర్శన, వేనుగాణం, భక్త మార్కండేయ నాటకం కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

నేడు భృంగివాహన సేవ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం స్వామి, అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - Feb 19 , 2025 | 11:10 PM