Coalition Government: 9,407 కోట్లతో ‘తల్లికి వందనం’ అమలు
ABN, Publish Date - Mar 01 , 2025 | 06:37 AM
‘తల్లికి వందనం’ పథకానికి 2025-26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరం నుంచి అందిస్తామని ప్రకటించింది.
ఈ సంవత్సరం నుంచి పథకం అమలు
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక హామీ అమలుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకానికి 2025-26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరం నుంచి అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఈ పథకానికి మొత్తం రూ.12వేల కోట్లు అవసరం. ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో ప్రభుత్వం అదనంగా నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు ‘అమ్మఒడి’ అమలు చేసినట్లు ప్రచారం చేసుకుంది. చివరికి వారి తల్లుల (43 లక్షల మంది) ఖాతాల్లో రూ.13వేలు చొప్పున జమ చేసింది. అప్పట్లో ఏడాదికి సుమారు రూ.6,500 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలుకు దానికి రెట్టింపు అవుతోంది.
పాఠశాల విద్యకు ప్రాధాన్యం
కీలకమైన పాఠశాల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో రూ.31,805 కోట్లు (దాదాపు 10ు) కేటాయించింది, గతేడాది రూ.29,909కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.1,896 కోట్లు పెంచింది.
Updated Date - Mar 01 , 2025 | 06:37 AM