పాఠశాలల్లో పరీక్షా పే చర్చా వీక్షణం
ABN, Publish Date - Feb 11 , 2025 | 01:48 AM
ప్రధాన మంత్రి ఢిల్లీ నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారాన్ని సోమవారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించారు.
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఢిల్లీ నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారాన్ని సోమవారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని మోదీ ఢిల్లీలో ఉదయం 10 గంటల నుంచి 9వ తరగతి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియా, రేడియో చానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారమైంది. ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి టెన్త్ విద్యార్థులు టీవీల ద్వారా వీక్షించారు. ప్రధాని.. విద్యార్థులతో చేసిన సంభాషణలను, వారిచ్చిన సమాధానాలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 380 ప్రభుత్వ, 142 ప్రైవేటు కలిపి మొత్తం 522 పాఠశాలల్లో వీక్షించారు. 59,601 మంది ప్రత్యక్షంగా చూశారు. వీరిలో 53,750 మంది విద్యార్థులు, 3,154 మంది ఉపాధ్యాయులు, 2,697 మంది విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.
Updated Date - Feb 11 , 2025 | 01:48 AM