ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోక్సో కేసులో ఇద్దరు యువకులకు రెండేళ్ళ జైలు, జరిమానా

ABN, Publish Date - Jan 30 , 2025 | 01:54 AM

పోక్సో కేసులో ఇద్దరు యువకులకు చిత్తూరు న్యాయస్థానం రెండేళ్ళ జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

చిత్తూరు లీగల్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఇద్దరు యువకులకు చిత్తూరు న్యాయస్థానం రెండేళ్ళ జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మదనపల్లె పట్టణానికి చెందిన ఓ బాలికను మూడేళ్ల క్రితం సదుం మండలం చెరుకువారిపల్లెకు చెందిన కోటకొండ చరణ్‌, తిరుపతికి చెందిన షేక్‌ హమీద్‌ కిడ్నాప్‌ చేశారు.బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మదనపల్లె టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.కేసు దర్యాప్తు చేసిన ఎస్‌ఐ చంద్రమోహన్‌ వారిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై బుధవారం పోక్సో కోర్టులో విచారణ జరిగింది. పూర్వాపరాలు పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శాంతి ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలుశిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. ఈ కేసును ఏపీపీ శైలజ వాదించారు.

Updated Date - Jan 30 , 2025 | 01:54 AM