రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:40 AM
పుంగనూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఏటవాకిలి క్రాస్ వద్ద గురువారం సిమెంట్ లారీని ద్విచక్రవాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
పుంగనూరు రూరల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పుంగనూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఏటవాకిలి క్రాస్ వద్ద గురువారం సిమెంట్ లారీని ద్విచక్రవాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు .. పుంగనూరు మండలం ఏటవాకిలి పంచాయతీ దిగువపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ వెంకట్రమణారెడ్డి(54), ప్రసన్నయ్యగారిపల్లెకు చెందిన ఇళ్ల నిర్మాణ మేస్ర్తీ గంగాధర్(45) ద్విచక్రవాహనంలో గ్రామ సమీపంలోని కోళ్లఫారం వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. నాయుడుపేట నుంచి కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ వెళుతున్న సిమెంట్ లారీని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఏటవాకిలి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకట్రమణారెడ్డి తీవ్రంగా గాయపడటంతో గుర్తించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అతన్ని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రమణారెడ్డి మృతి చెందాడు.పుంగనూరు సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలం రామసముద్రం మండలం కావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 24 , 2025 | 01:40 AM