ఆకాశమే ‘ఆమె’ హద్దు
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:37 AM
చందమామ రావే..జాబిల్లి రావే అంటూ అమ్మ గోరుముద్దలను తినిపించేది. ఆకాశంలో వెలిగిపోయే చంద్రుడ్ని చూపించేది. అయితే ఇప్పుడు ఆ చందమామనే చేరుకుందామంటున్నారు మన మహిళామూర్తులు. ఔను..ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో పురుషులకు దీటుగా భాగస్వాములై సత్తా చాటుకున్నారు.
నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం
రాకెట్‌లా దూసుకువెళ్తున్న తెలుగు మహిళలు
అంతరిక్ష రంగంలోనూ కీలక భూమిక
ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లో సత్తా
చందమామ రావే..జాబిల్లి రావే అంటూ అమ్మ గోరుముద్దలను తినిపించేది. ఆకాశంలో వెలిగిపోయే చంద్రుడ్ని చూపించేది. అయితే ఇప్పుడు ఆ చందమామనే చేరుకుందామంటున్నారు మన మహిళామూర్తులు. ఔను..ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో పురుషులకు దీటుగా భాగస్వాములై సత్తా చాటుకున్నారు. ప్రపంచంలో తాము అడుగుపెట్టని రంగమే లేదని నిరూపించుకున్నారు. నవ ఆవిష్కరణలు, పరిశోధనలు, ఒంటబట్టవనే విమర్శలను తిప్పికొడుతూ.. సైన్స్ అంటే సై అంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు ఇస్రోలోని మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు. ఉపగ్రహాలను కక్ష్యలోని పంపే ప్రక్రియలో సైతం కీలక భూమిక పోషిస్తూ అబ్బురపరుస్తున్నారు. వీరి ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇస్రోలో ముఖ్య భూమిక పోషిస్తున్న ముగ్గురు తెలుగు మహిళల పరిచయం... ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకం.
-సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి
ఉపగ్రహాల రూప‘కల్పన’
పుత్తూరు మండలం తడుకు గ్రామానికి చెందిన కాళహస్తి కల్పనకు చిన్నప్పటి నుంచే అంతరిక్ష రంగంపై ఆసక్తి. ఆ దిశగానే కెరీర్‌ను మలచుకున్నారు. తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి కావడంతో విద్యాభ్యాసమంతా చెన్నైలో సాగింది. తల్లి ఇందిర గృహిణి. చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయంలో కల్పన ఇంజినీరింగ్ చదివారు. అదే సమయంలో ఇస్రోలో ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడటంలో ఆమె కల సాకారానికి తొలి అడుగు పడింది. 2000లో శ్రీహరికోట ఇస్రోలో రాడార్ ఇంజినీర్‌గా ఎంపికై వడివడిగా శాస్త్రవేత్తగా ఎదిగారు. ఐదేళ్లపాటు పనిచేశాక బెంగళూరు ఉపగ్రహ కేంద్రానికి బదిలీ అయ్యారు. అక్కడే శాటిలైట్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా అనుభవం సంపాదించారు. ప్రాజెక్టు అసోసియేట్ డైరెక్టర్‌గా ఆరు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. చంద్రయాన్-3 వంటి కీలక ప్రాజెక్టులో అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యత వహించారు. చంద్రయాన్-2లో కూడా కల్పన కీలక పాత్ర పోషించారు. రాడార్ ఇంజినీర్‌గా అడుగుపెట్టి విశేష కృషిత్టో నేడు ఉపగ్రహాల తయారీలో ముఖ్య పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు.
సెన్సార్ సాంకేతికతలో ‘విజయ’ ప్రస్థానం
యండ్రపల్లి విజయ.. పట్టుదలకు కేరా్‌ఫగా నిలిచే ఈ తెలుగుబిడ్డ కృష్ణాజిల్లా ముదునూరులో సామాన్య కుటుంబంలో పుట్టారు. తండ్రి గంగాధర్ కోపరేటివ్ బ్యాంకులో సాధారణ ఉద్యోగి. తల్లి వెంకటరత్నం గృహిణి. విజయవాడలోని పటమట ప్రభుత్వ పాఠశాలలో విజయ పదోతరగతి వరకూ చదివారు. సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల(విజయవాడ)లో ఇంజనీరింగ్ చదివారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీలో సీటొచ్చింది. చేరిన నెల రోజులకే అనూహ్యంగా ఇస్రోలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఐఐటీ సీటు వదులుకోవడం బాధనిపించినా అంతరిక్షరంగంపై మక్కువ ఆకర్షించింది. బెంగళూరులోని సెన్సార్లు తయారయ్యే ఇస్రో ఎలకో్ట్ర ఆప్టిక్స్ సిస్టమ్స్‌లో చేరారు. తొలినాళ్లలోనే ప్రతిభ చాటుకున్నారు. ఆమె నేతృత్వంలో రూపొదించిన సెన్సార్‌ను ప్రప్రథమంగా పీఎ్‌సఎల్వీ ప్రాజెక్టుకు వినియోగించారు. అనంతరం మరో క్లిష్టమైన స్టార్ సెన్సార్ తయారీలో సఫలీకృతమయ్యారు. ఓషన్‌శాట్-3, జీశాట్, రీశాట్ సిరీ్‌సలో కొత్త ఉపగ్రహాల్లో ఈ సాంకేతికతను వినియోగించారు. మైక్రోశాట్‌లో తక్కువ బరువుతో స్టార్ సెన్సార్‌ను రూపొందించి విస్మయపరిచారు. ఇదే సెన్సార్‌ను చంద్రయాన్-3లోనే కాదు గగన్‌యాన్‌కు కూడా ఉపయోగించారు. ఈమె గగన్‌యాన్ ప్రాజెక్టుకు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇస్రోలో పురుషులకు దీటుగా అవకాశాలను అందిపుచ్చుకుని కీలకమైన సెన్సార్ విభాగంలోనూ విజయ తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
ఉమా..ప్రతిభకు చిరునామా
గొట్టిముక్కల ఉమాదేవి.. చిరుద్యోగిగా కెరీర్‌లో అడుగుపెట్టి అసాధారణ ప్రతిభతో ఉన్నతస్థాయికి దూసుకువెళ్లారు. హైదరాబాదులోనే పుట్టి పెరిగారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తవ్వగానే నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సెంటర్(హైదరాబాద్)లో సాధారణ ఉద్యోగిగా చేరారు. 1988లో భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల కోసం కొత్త గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరగడం ఉమాదేవికి కలిసొచ్చింది. ఎన్‌ఆర్‌ఎ్‌ససీలో అనుభవంతో గ్రౌండ్‌స్టేషన్‌లోని శాటిలైట్ డేటా విభాగంలో సీనియర్ ఉద్యోగిగా చేరారు. ఆమెలోని ప్రతిభకు,చొరవకు ఇస్రో సీనియర్ అఽధికారుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ తత్వమే ఆమెను కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామిని చేసింది. విజయాల నమోదుకు కారణమైంది. ఉన్నతంగా ఆలోచించే ఉమాదేవి భూటాన్‌లో ఇస్రో కొత్తగా స్థాపించిన గ్రౌండ్ స్టేషన్‌కు సాఽరఽథ్య బాధ్యతలు చేపట్టారు. ఈమె తండ్రి గోపాలరావు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వద్ద సీఎ్‌సగా పనిచేశారు. తల్లి లక్ష్మీభాయ్ గృహిణి.
Updated Date - Mar 08 , 2025 | 01:37 AM