ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్వీయూ మెయిన్‌ గేటు వద్ద ఉద్రిక్తత

ABN, Publish Date - Feb 04 , 2025 | 01:50 AM

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీయూ మెయిన్‌ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులపై ఎస్పీ ఆగ్రహం

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీయూ మెయిన్‌ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 9.30 గంటలకు వైసీపీ శ్రేణులు యూనివర్శిటీ ప్రధాన రోడ్డు వద్ద ఆందోళన చేపట్టడంతో పోలీసులు చెదరగొట్టారు. వర్సిటీ వద్ద 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్టు ఉన్నా వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో కూటమి నాయకులు, కార్పొరేటర్లు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు బాలాజీ కాలనీ నుంచి వర్సిటీ ఫ్లై ఓవర్‌ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ కార్పొరేటర్ల బస్సు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను సైతం లెక్క చేయకుండా వర్సిటీ వైపు చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఎస్పీ హర్షవర్ధనరాజు ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసుల తీరుపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. వర్సిటీ రోడ్డుపైకి భారీ సంఖ్యలో ఆందోళనకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు చొచ్చుకుని వస్తున్నా నియంత్రించకపోవడంపై తిరుపతి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీలత, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ గిరిధర్‌, ప్రధాన గేటు వద్ద విధుల్లో వున్న ఇద్దరు పోలీసు అధికారులపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలు చేయడానికి వచ్చారా? జాతరను చూడడానికి వచ్చారా అని అసహనం వ్యక్తంచేశారు. విధులు సక్రమంగా చేయకుంటే వెళ్లండంటూ ఆగ్రహించారు. పోలీసులు ఎంత కఠినంగా విధులు నిర్వహిస్తే అంత భయం ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదన్నారు.

బస్సు అద్దాల ధ్వంసంపై కేసు

ఎస్వీయూ వర్సిటీ వద్ద వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సు డోరు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నారాయణవనం ఎస్‌ఐ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు వర్సిటీ సీఐ రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 04 , 2025 | 01:50 AM