ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.4.20 కోట్ల ఎర్రచందనం పట్టివేత

ABN, Publish Date - Feb 07 , 2025 | 01:33 AM

రెండు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.4.20 కోట్ల విలువైన ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశామన్నారు.

స్మగ్లర్లను అరెస్ట్‌ చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్‌

మంగళం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రెండు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.4.20 కోట్ల విలువైన ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశామన్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయలోని కోమిటోనిచెరువు సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కూంబింగ్‌ చేపట్టారు. ఒక కారు, మోటార్‌ సైకిల్‌ ఆగి ఉండటం.. కొందరు ఎర్రచందనం దుంగలను కారులో లోడ్‌ చేసేందుకు వెళ్తుండటాన్ని గమనించారు. టాస్క్‌ఫోర్సు సిబ్బంది వారిని చుట్టుముట్టగా ఎనిమిది మంది పట్టుబడ్డారు. మిగిలిన వారు పారిపోయారు. వారి నుంచి రెండు వాహనాలు, 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. విచారణలో వారు చెప్పిన సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రం హొస్కోట తాలూకా కటికనల్లి సమీపంలో దాచి ఉంచిన 185 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం, స్మగ్లర్లను, వాహనాలను తిరుపతి కపిలతీర్థం వద్ద గల టాస్క్‌ఫోర్స్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వీటి మొత్తం విలువ రూ.4.2 కోట్లుగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. సిబ్బందికి రివార్డు ప్రకటించారు.

Updated Date - Feb 07 , 2025 | 01:33 AM