ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీకో కార్యదర్శి

ABN, Publish Date - Feb 11 , 2025 | 01:38 AM

గ్రామ పంచాయతీ వ్యవస్థలో అశాస్త్రీయమైన క్లస్టర్‌ విధానంతో పాలనలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. ఆదాయం ఆధారంగా తెచ్చిన క్లస్టర్‌ విధానంతో సిబ్బంది కేటాయింపులో హెచ్చుతగ్గులు ఏర్పడి గ్రామ పంచాయతీల్లో పనులు సకాలంలో పూర్తికావడం లేదు.

క్లస్టర్ల స్థానంలో గ్రేడ్ల విధానం

వర్గీకరణకు కమిటీ ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ వ్యవస్థలో అశాస్త్రీయమైన క్లస్టర్‌ విధానంతో పాలనలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. ఆదాయం ఆధారంగా తెచ్చిన క్లస్టర్‌ విధానంతో సిబ్బంది కేటాయింపులో హెచ్చుతగ్గులు ఏర్పడి గ్రామ పంచాయతీల్లో పనులు సకాలంలో పూర్తికావడం లేదు. ఈ సమస్యను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ క్లస్టర్ల విధానానికి స్వస్తిపలికి జనాభా ఆధారంగా గ్రేడ్ల విధానం తీసుకు రావాలని నిర్ణయించారు. గ్రేడ్లవారీగా ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శితో పాటు అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. ఈ మేరకు పంచాయతీ వ్యవస్థ వర్గీకరణకు ఇటీవల నలుగురు అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది.

ఎదురవుతున్న ఇబ్బందులు

2010వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీల ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకుని క్లస్టర్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక్కో క్లస్టర్‌లో మూడు నుంచి నాలుగు పంచాయతీలున్నాయి. కొన్నిచోట్ల ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా, తక్కువ ఆదాయం ఉన్నచోట జనాభా ఎక్కువగా ఉండడంతో 15ఏళ్ళుగా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి.

మార్పులు ఇలా...

చిత్తూరు జిల్లాలోని 31మండలాల్లో 696పంచాయతీలున్నాయి. వైసీపీ హయాంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినా క్లస్టర్ల విధానంలో మార్పులు చేయలేదు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడింగులు ఇచ్చి తగినంత సిబ్బందిని ఇచ్చి, నిధులు కేటాయిస్తే వ్యవస్థ గాడిన పడుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గ్రేడ్లు కేటాయించాక కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. ఆదాయం, జనాభా పాత్రిపదికన కలెక్టర్లు ఇచ్చే నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత గ్రేడ్ల విభజనకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. 2500 మంది జనాభాకు ‘ఎ’ కేటగిరి కింద ఆరుగురు, 2500 నుంచి 3500 జనాభాను ‘బి’ కేటగిరి కింద గుర్తించి ఏడుగురు, 3500కు మించి జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను ‘సి’ కేటగిరి కింద గుర్తించి ఎనిమిదిమంది సచివాలయ ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వం జీవో నెం.1లో సూచనలు జారీచేసింది. ఈ మేరకు రేషనలైజేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. కాగా జనాభాను గుర్తించడంలో అధికారులు సతమతమవుతున్నారు. 2011తర్వాత నుంచి ఇప్పటివరకూ అధికారపూర్వకంగా జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల జనాభా లెక్కలుగా వేటిని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఖాళీ కుర్చీ... పల్లెలకేదీ దిక్సూచి?

గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ విధానాలు పల్లె పాలనకు తీవ్ర విఘాతంగా మారగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఖాళీల సమస్య తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో గ్రేడ్‌-1, 2, 3, 4, 5లలో 540 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. 696 పంచాయతీల్లో 156 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో ఒక్కో కార్యదర్శికి 2-3 గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించినా, వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఆశించిన ఫలితం ఉండడం లేదు.

ఉన్నతాధికారుల దృష్టికి....

జిల్లాలో కొన్ని ఖాళీలున్న మాట వాస్తవమే. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం. కార్యదర్శుల పోస్టుల విషయంలో త్వరలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి ఎక్కడా పాలనలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- కె. సుధాకర రావు, డీపీవో, చిత్తూరు.

Updated Date - Feb 11 , 2025 | 01:38 AM