విధేయతకు పట్టం
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:56 AM
భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడుగా సామంచి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తిరుపతిలో మంగళవారం జరిగిన బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో సామంచిని ఆ పార్టీ ప్రముఖుల సమక్షంలో ఎన్నికల అధికారి పి.సురేందర్‌రెడ్డి ప్రకటించారు.
బీజేపీ జిల్లా సారథిగా సామంచి
తిరుపతి, జనవరి21(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడుగా సామంచి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తిరుపతిలో మంగళవారం జరిగిన బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో సామంచిని ఆ పార్టీ ప్రముఖుల సమక్షంలో ఎన్నికల అధికారి పి.సురేందర్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎ్‌సఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)చేరిన సామంచి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1989 నుంచి 99వరకు నగర కార్యదర్శిగా, జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పదేళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 1999లో బీజేపీలో చేరిన ఆయన క్షేత్రస్థాయి నుంచి వివిధ హోదాల్లో చురుగ్గా వ్యవహరించారు. తాజాగా రాష్ట్ర అఽధికార ప్రతినిధిగా ఉంటూ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించినప్పటికీ అధికారిక పదవులు దక్కలేదని ఏనాడూ అసంతృప్తిచెందని వ్యక్తిగా సామంచికి మంచి పేరుంది. అతడి విధేయతను గుర్తించిన అధిష్ఠానం జిల్లా బాధ్యతలను అప్పగించినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రతి ఇంటికీ బీజేపీ నా లక్ష్యం
జిల్లాలో పార్టీ విస్తరణే లక్ష్యంగా కార్యకర్తలను కలుపుకొని ప్రతి ఇంటికీ వెళ్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీ కార్యకర్తల కృషి, పట్టుదల ఉందన్నారు. అభివృద్ధే నినాదంతో తిరుపతిలో నిధులు వెచ్చిస్తున్న బీజేపీ అదే స్థాయిలో పార్టీని బలపరచుకోవడానికి అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదులో తిరుపతి మూడో స్థానం సాధించడంపై కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ సిద్దాంతాలు, కార్యకర్తల క్రమశిక్షణకే పెద్దపీట వేసి బూత్‌స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు అందరి అభిప్రాయాల మేరకు ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం నేతలు, కార్యకర్తలు సామంచి శ్రీనివా్‌సను సత్కరించారు. ఒక పని చేయడానికి బాధ్యతలు తీసుకుంటే సరిపోదని బాధ్యతతో పనిచేస్తేనే ఆ పనిలో వందశాతం విజయం సాధించగలమని జిల్లా ఎన్నికల అధికారి సురేంద్రరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కోలా ఆనంద్, మట్టా ప్రసాద్, మాజీ అధ్యక్షుడు చంద్రప్ప, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, కండ్రిగ ఉమా, ఎస్‌ఎ్‌సఆర్ నాయుడు, రాటకొండ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం యాదవ్, పొనగంటి భాస్కర్, అజయ్‌కుమార్, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, బీడీ బాలాజీ, వెంకటముని, డాక్టర్ శ్రీహరిరావు, జిల్లానుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 22 , 2025 | 01:56 AM