ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN, Publish Date - Mar 01 , 2025 | 02:21 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.

రాయనున్న 62,761 విద్యార్థులు ఫ 86 కేంద్రాల్లో ఏర్పాట్లు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. 32,213 మంది ప్రథమ, 30,548 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 62,761 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పర్యవేక్షణలో ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన పిచ్చాటూరు, నాగలాపురం పరీక్ష కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేశారు. స్పెషల్‌ ఆఫీసర్‌తోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు 4, సిట్టింగ్‌ స్క్వాడ్లు 8, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 86 మంది, చీఫ్‌ సూపరింటెండెంట్లు 86 మంది, కస్టోడియన్లుగా 20 మందిని నియమించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. విద్యార్థుల సహాయార్థం కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు, సహాయం కోసం 0877 2237200లో కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించవచ్చు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరాదనే నిబంధన ఉందని, దీన్ని గుర్తించి విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

Updated Date - Mar 01 , 2025 | 02:21 AM