ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టెర్రకోట బొమ్మలకు భౌగోళిక గుర్తింపు

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:52 AM

టెర్రకోట మట్టి కుండలు, బొమ్మలు, తెల్లజిల్లేడు వినాయక బొమ్మల తయారీ కేంద్రాలకు భౌగోళిక గుర్తింపునకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ దృష్టి సారించారు.

పలమనేరు బొమ్మల తయారీ ప్రాంతాల్లో హైదరాబాదు రిసొల్యూట్‌ బీ2బీ కన్సల్టెన్సీ బృందం

రెండ్రోజులు జిల్లాలో పర్యటించిన బీ2బీ బృందం

అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు సన్నాహాలు

చిత్తూరు సెంట్రల్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): టెర్రకోట మట్టి కుండలు, బొమ్మలు, తెల్లజిల్లేడు వినాయక బొమ్మల తయారీ కేంద్రాలకు భౌగోళిక గుర్తింపునకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ దృష్టి సారించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటి భౌగోళిక గుర్తింపుకు తగు సూచనలు చేశారు. సంకల్ప పథకం అమలులో భాగంగా హైదరాబాదు రిసొల్యూట్‌ బీ2బీ కన్సల్టెన్సీ నేతృత్వంలోని బృందం మంగళ, బుధవారాల్లో పలమనేరు మండలం గంటావూరులోని టెర్రకోట మట్టికుండలు, బొమ్మల తయారీ ప్రాంతాలను సందర్శించారు. గంగాధరనెల్లూరు మండలంలోని కలవకుంటలో తెల్లజిల్లేడు వినాయక బొమ్మల తయారీ ప్రాంతాల్లో సమాచారం సేకరించారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగానూ, సంప్రదాయ పద్ధతుల్లో ఉండటంతో వీటికి రాష్ట్రం, దేశంతోపాటు అంతర్జాతీయంగానూ డిమాండ్‌ ఉండటమే భౌగోళిక గుర్తింపుకు ప్రాముఖ్యత సంతరించుకుంది.

Updated Date - Jan 24 , 2025 | 01:52 AM