ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీబీసీఐ కింద భూములు కోల్పోతున్న రైతులకు రూ. 78.84 కోట్ల పరిహారం

ABN, Publish Date - Feb 07 , 2025 | 01:22 AM

చిల్లకూరు మండలం తమ్మినపట్నం, కోట మండలం కొత్తపట్నం గ్రామాల పరిధిలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీసీఐ)కు భూములు కోల్పోతున్న రైతులకు రూ.78,84,83,200 పరిహారం చెల్లించడానికి కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

తిరుపతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): చిల్లకూరు మండలం తమ్మినపట్నం, కోట మండలం కొత్తపట్నం గ్రామాల పరిధిలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీసీఐ)కు భూములు కోల్పోతున్న రైతులకు రూ.78,84,83,200 పరిహారం చెల్లించడానికి కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఈ అంశాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ 2012 సెప్టెంబరు 14న జారీ చేసిన జీవో ఎంఎస్‌ నంబరు 571ను సడలించి మరీ ఈ ఒక్కసారికి ఈ మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది. టీటీడీలో 15 సీనియర్‌ పోటు వర్కర్‌ పోస్టులను సూపర్‌వైజర్‌ పోస్టులుగా స్థాయి పెంచాలని టీటీడీ చేసిన అభ్యర్థనపై మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు 15 సీనియర్‌ పోటు వర్కర్‌ పోస్టులను రూ. 40,970 - రూ.1,24,380 జీత శ్రేణితో సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాతో సమాన హోదా కల్పిస్తూ సూపర్‌వైజర్‌ పోస్టులుగా స్థాయి పెంచేందుకు అంగీకరించింది. అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి ఈ రెండు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:22 AM