ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోడల్‌ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు

ABN, Publish Date - Feb 05 , 2025 | 01:20 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బలోపేతం చేసే దిశగా మోడల్‌ పాఠశాలలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అమలయ్యేలా చూడాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బలోపేతం చేసే దిశగా మోడల్‌ పాఠశాలలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అమలయ్యేలా చూడాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన డీఈవో కేవీఎన్‌ కుమార్‌తో కలిసి ఎంఈవోలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 130 క్లస్టర్లు ఉండగా.. ఒక్కోదానిలో 5నుంచి 10 వరకు పాఠశాలలు ఉంటాయన్నారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యను బట్టి మోడల్‌ పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మోడల్‌ స్కూల్‌లో ఐదుగురు ఉపాధ్యాయులు, 60మందికిపైగా విద్యార్థులు ఉంటారని వివరించారు. 60మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న పాఠశాలలను బేసిక్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా ఉంటాయన్నారు. గ్రామాల్లో బ్రిడ్జిలు దాటడం, 5 కిలోమీటర్లు ప్రయాణం చేసే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 01:20 AM