ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులను మోసగించిన దళారీని విచారించిన పోలీసులు

ABN, Publish Date - Feb 20 , 2025 | 02:20 AM

శ్రీవారి దర్శనాలు, ఆర్జితసేవలు, వసతి పేరుతో భక్తులను మోసగించిన దళారీని తిరుమల పోలీసులు విచారించారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడికి అభిషేకం టికెట్లు తీసిస్తానని భీమవరానికి చెందిన రమణప్రసాద్‌ నమ్మించి రూ.4 లక్షలు వసూలు చేశాడు. మోసపోయిన గ్రహించిన బాధితులు గతేడాది డిసెంబరులో తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఈ దళారీని పక్క రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పీటీ వారెంట్‌ ద్వారా అతడిని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. తనకు టీటీడీ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, తాను ఏ దర్శనం, సేవనైనా ఇప్పించగలనని కొన్నేళ్లుగా రమణప్రసాద్‌ భక్తులను నమ్మించి మోసగిస్తున్నాడు. 2018లోనే అతడిపై తిరుమల టూటౌన్‌లో నాలుగు కేసులు, తాజాగా వన్‌టౌన్‌లో మరో కేసు నమోదయ్యాయి.

తిరుమల, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనాలు, ఆర్జితసేవలు, వసతి పేరుతో భక్తులను మోసగించిన దళారీని తిరుమల పోలీసులు విచారించారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడికి అభిషేకం టికెట్లు తీసిస్తానని భీమవరానికి చెందిన రమణప్రసాద్‌ నమ్మించి రూ.4 లక్షలు వసూలు చేశాడు. మోసపోయిన గ్రహించిన బాధితులు గతేడాది డిసెంబరులో తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఈ దళారీని పక్క రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పీటీ వారెంట్‌ ద్వారా అతడిని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. తనకు టీటీడీ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, తాను ఏ దర్శనం, సేవనైనా ఇప్పించగలనని కొన్నేళ్లుగా రమణప్రసాద్‌ భక్తులను నమ్మించి మోసగిస్తున్నాడు. 2018లోనే అతడిపై తిరుమల టూటౌన్‌లో నాలుగు కేసులు, తాజాగా వన్‌టౌన్‌లో మరో కేసు నమోదయ్యాయి. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ చీటింగ్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇతర కేసులకు సంబంధించి విచారణ కోసం అతన్ని పోలీసులు ఇతర రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

Updated Date - Feb 20 , 2025 | 02:20 AM