కొనసాగిన న్యాక్ పరిశీలన
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:38 AM
ద్రావిడ విశ్వవిద్యాలయంలో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు రెండవరోజైన గురువారం కూడా విస్తృతంగా పర్యటించారు. మొదట విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
గుడుపల్లె, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయంలో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు రెండవరోజైన గురువారం కూడా విస్తృతంగా పర్యటించారు. మొదట విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆ తరువాత మూలికా వనం, యానిమల్ హౌస్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఫోక్లోర్ మ్యూజియానికివెళ్లి అక్కడున్న పురాతన వస్తువులను పరిశీలించారు. అక్కడే ఉన్న అమ్మవారి ఆలయంలో విద్యార్థులు నిర్వహించిన సంక్రాంతి వేడుకలను న్యాక్ కమిటీ సభ్యులు తిలకించారు. మధ్యాహ్నం ఇందిరా గాంధీ ఓపెన్ స్టేడియం, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ కోర్టులు, జిమ్‌ను పరిశీలించారు. బాలుర, బాలికల హాస్టళ్లను తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకొన్నారు. సాయంత్రం ఎమినో హౌస్‌లోని కమిటీ హాలులో పూర్వపు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆ తరువాత పరిపాలన భవనంలోని కమిటీ హాల్‌లో విశ్వవిద్యాలయంలో ఉన్న వివిధ కమిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. వీసీ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్ కుమార్, ద్రావిడ వర్సిటీ న్యాక్ కమిటీ కోఆర్డినేటర్ ఎంఎన్ వెంకటేశ, డీన్ శ్యామల, న్యాక్ కమిటీ సభ్యులు విమల్ కిషోర్, కనిక శర్మ, అరుణ్ ఎస్ కరత్, హెచ్.ఎన్.వగీలా, సత్య ప్రకాష్ నికోసి, రితూ లిహాల్ పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 01:38 AM