సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
ABN, Publish Date - Feb 11 , 2025 | 01:51 AM
సీనియర్ ఇంటర్ జనరల్ కోర్సుల విద్యార్థులకు సోమవారం ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
తిరుపతి(విద్య), ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఇంటర్ జనరల్ కోర్సుల విద్యార్థులకు సోమవారం ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 94పరీక్షాకేంద్రాల్లో ఉదయం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 4278మంది విద్యార్థులకుగాను 4205మంది హాజరవ్వగా..73మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మధ్యాహ్న సెషన్‌లో 3143 మందికి 3115మంది హాజరయ్యారు. 28మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
Updated Date - Feb 11 , 2025 | 01:51 AM