ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లేని కాలేజ్‌.. ఉన్నట్లుగా..!?

ABN, Publish Date - Feb 23 , 2025 | 01:59 AM

చిత్తూరు సెంట్రల్‌/పెనుమూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు దగ్గర పడుతున్న క్రమంలో పెనుమూరులో విచిత్రం జరిగింది. లేని కాలేజ్‌ ఉన్నట్లు దుమారం రేగింది. ఇక్కడ 88 మంది విద్యార్థులు ఉన్నారని, కళాశాల యాజమాన్యం వీరి పరీక్షల ఫీజు చెల్లించకపోవడంతో, భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారుతుందనే వాదనలు వినిపించాయి. ఈ సంఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. స్పందించిన కలెక్టర్‌ విచారణ చేయాలని ఇంటర్మీడియట్‌ జిల్లా వృత్తి విద్యాధికారి (డీవీఈవో) సయ్యద్‌ మౌలకు ఆదేశాలు జారీచేశారు. ఆయన తహసీల్దారు శ్రావణ్‌కుమార్‌తో కలిసి శనివారం కళాశాలలో విచారణ చేపట్టారు. అనంతరం అక్కడున్న కళాశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

కళాశాలలో విచారణ చేపడుతున్న డీవీఈవో సయ్యద్‌ మౌల

-కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు ఫ రంగంలోకి ఇంటర్మీడియట్‌, రెవెన్యూ అధికారులు

-కళాశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు

చిత్తూరు సెంట్రల్‌/పెనుమూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు దగ్గర పడుతున్న క్రమంలో పెనుమూరులో విచిత్రం జరిగింది. లేని కాలేజ్‌ ఉన్నట్లు దుమారం రేగింది. ఇక్కడ 88 మంది విద్యార్థులు ఉన్నారని, కళాశాల యాజమాన్యం వీరి పరీక్షల ఫీజు చెల్లించకపోవడంతో, భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారుతుందనే వాదనలు వినిపించాయి. ఈ సంఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. స్పందించిన కలెక్టర్‌ విచారణ చేయాలని ఇంటర్మీడియట్‌ జిల్లా వృత్తి విద్యాధికారి (డీవీఈవో) సయ్యద్‌ మౌలకు ఆదేశాలు జారీచేశారు. ఆయన తహసీల్దారు శ్రావణ్‌కుమార్‌తో కలిసి శనివారం కళాశాలలో విచారణ చేపట్టారు. అనంతరం అక్కడున్న కళాశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

వివరాలిలా..

పెనుమూరులో శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జూనియర్‌ కళాశాల ఉందని, ఇందులో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపుల్లో 52 మంది బాలురు, 36 మంది బాలికలు చదువుతున్నారని, వీరికి కళాశాల యాజమాన్యం పరీక్ష ఫీజు చెల్లించలేదని ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేసిన అధికారులకు డిగ్రీ కళాశాలలో అసలు జూనియర్‌ కళాశాల లేదని, దాన్ని మూడేళ్ల కిందటే ఆ యజమాని తిరుపతిలోని బైరాగిపట్టెడలోని ఓ కళాశాల యాజమాన్యానికి విక్రయించారని, విద్యార్థులంతా తిరుపతి వాసులేనని తేలింది. పైగా ఈ వ్యవహారం తిరుపతి రీజనల్‌ ఇంటర్మీడియట్‌ అధికారి దృష్టిలో ఉందని తేలినట్లు సమాచారం. ఇలాంటి ఇలాంటి మార్పులపై మరింత లోతుగా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 23 , 2025 | 01:59 AM