ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారుల హాహాకారాలు

ABN, Publish Date - Feb 22 , 2025 | 01:44 AM

నవ్వుతూ, కేరింతలతో బస్సులో వస్తున్నారా చిన్నారి విద్యార్థులు. ఒక్కసారిగా బస్సు కుదుపుతో ఆందోళన చెందారు. ఆపై బోల్తాపడిన బస్సులో నుంచి చిన్నారుల హాహాకారాలు మిన్నంటాయి.

బోల్తాపడ్డ బస్సులో నుంచి చిన్నారులను బయటకు తీస్తున్న స్థానికులు , గాయాలైన చిన్నారులు క్రిషిత, యువశ్రీ, గీతిక

నవ్వుతూ, కేరింతలతో బస్సులో వస్తున్నారా చిన్నారి విద్యార్థులు. ఒక్కసారిగా బస్సు కుదుపుతో ఆందోళన చెందారు. ఆపై బోల్తాపడిన బస్సులో నుంచి చిన్నారుల హాహాకారాలు మిన్నంటాయి. శుక్రవారం ఉదయం తడ మండలం కరిపేటికాలువ బ్రిడ్జిపై వెళుతున్న నారాయణ విద్యాసంస్థల స్కూల్‌ బస్సు టైర్ల వద్ద కట్టలు విరిగిపోవడంతో అదుపు తప్పి రైలింగ్‌ను ఢీ కొని 15 అడుగుల లోతులో రోడ్డు పక్కకు వెళ్లి బొల్తా కొట్టింది. ఆ సమయంలో 37 మంది విద్యార్థులు ఉన్నారందులో. డ్రైవరు వినోద్‌కు కాలు విరగ్గా, చిన్నారి రిషితకు నాలుగు తెగి గాయమైంది. మిగిలిన లిఖిత్‌, భరత్‌, నానీష్‌, గోకులకృష్ణ, యువశ్రీ, గీతిక, జస్మిత, క్రిషిక, నవ్యశ్రీ, సంజన, దర్శిక్‌, లక్ష్మీచరణ్‌, మహిత్‌కుమార్‌, కుముదశ్రీ, నిషిత్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కలిసి చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. వీరి రోదనలు మిన్నంటాయి.

- తడ, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 22 , 2025 | 01:44 AM