ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్రం స్థలం కబ్జాకు యత్నం

ABN, Publish Date - Mar 07 , 2025 | 12:03 AM

కదిరి మండలంలోని సున్నపుగుట్టతండాకు సమీపంలో సత్రం స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి కుట్రపన్నారు. ఆ స్థలంలో రాళ్లను కూడా పాతారు.

స్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది

కదిరిఅర్బన, మార్చి6 (ఆంధ్రజ్యోతి): కదిరి మండలంలోని సున్నపుగుట్టతండాకు సమీపంలో సత్రం స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి కుట్రపన్నారు. ఆ స్థలంలో రాళ్లను కూడా పాతారు. స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీఆర్‌ఓ ఇనయతుల్లా, వీఆర్‌ఏలు చంద్ర, నాగభూషణం గురువారం ఆ సత్రం స్థలాన్ని పరిశీలించారు. నాటిన రాళ్లను పరిశీలించారు. గతంలో కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం వచ్చే బాటసారుల కోసం సర్వేనెంబర్‌ 458-1లో సత్రం నిర్మించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. 458లోని 55 సెంట్లు భూమిని ఇతరులు కొనుగోలు చేశారు. అయితే రోడ్డుకు అనుకుని ఉన్న రెండు సెంట్ల సత్రం స్థలాన్ని కూడా కొనుగోలుదారులు భూమిలోకి కలుపుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

Updated Date - Mar 07 , 2025 | 12:03 AM