ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Department: ఎక్సైజ్‌ మామూళ్లపై విచారణ!

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:33 AM

ఒక్కో షాపు నుంచి రూ.10వేలు చొప్పున వసూలు చేస్తున్న వ్యవహారం ఈ కథనంతో బట్టబయలైంది. ఇదే విషయంపై ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు.

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

విచారణాధికారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌శాఖలో మమూళ్ల వసూలుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘పైవాళ్లకివ్వాలి..పదివేలు ఇవ్వండి’ శీర్షికన ఈ వ్యవహారంపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం ఆ శాఖలో కలకలం రేపింది. ఒక్కో షాపు నుంచి రూ.10వేలు చొప్పున వసూలు చేస్తున్న వ్యవహారం ఈ కథనంతో బట్టబయలైంది. ఇదే విషయంపై ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించడంతో ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు మరోసారి ఆరా తీశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మను విచారణాధికారిగా నియమించారు. కథనంలో పేర్కొన్న ఆరోపణలు సీరియ్‌సగా ఉన్నాయని, అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:33 AM