ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Deputy Speaker : సునీల్‌ను సస్పెండ్‌ చేయాలి

ABN, Publish Date - Feb 07 , 2025 | 05:21 AM

కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆకివీడులో బుధవారం జరిగిన సంఘటన అతడి అక్రమాలకు నిదర్శనమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు డిమాండ్‌

కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

ఆకివీడు గొడవలో ఆయన ప్రమేయం ఉంది

ఆక్రమణల తొలగింపు కులాలకు ఆపాదించడం ఏంటి?

కాళ్ల, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆకివీడులో బుధవారం జరిగిన సంఘటన అతడి అక్రమాలకు నిదర్శనమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆకివీడులో బుధవారం సాయంత్రం పోలీసు స్టిక్కర్‌తో ఉన్న ఇన్నోవా కారులో వచ్చి నగర పంచాయతీ వద్ద గొడవ చేసిన వాళ్లు సునీల్‌ కుమార్‌ మనుషులే అని పోలీసు విచారణలో తేలిందన్నారు. సునీల్‌ కుమార్‌ వద్ద సీసీగా పనిచేసిన వ్యక్తి చెబితే వాళ్లు వచ్చినట్లు తెలిసిందన్నారు. ఆ కారు సునీల్‌ కుమార్‌ అనుచరుడు గుత్తికొండ వెంకట జోగారావు పేరుపై ఉందని అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్నోవా కారుపై అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ స్టిక్కర్‌లో సునీల్‌కుమార్‌ బొమ్మ ఉందని తెలిపారు. కారులో వచ్చి ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఇంత విచ్చలవిడిగా రౌడీయిజం చేయడానికి తెగిస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలని చెప్పారు. సమాజానికి మంచి జరగాలని భావించే తనకు కులాలతో సంబంధం లేదని, అందరినీ సమాన దృష్టితో చూస్తానని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పంట కాల్వలు, మంచినీటి చెరువులపై ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుడితే.. దానిని కులాలకు ఆపాదించడం సరికాదన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 05:21 AM