problem of drinking water తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం
ABN, Publish Date - Jan 18 , 2025 | 12:06 AM
మండలంలో తాగునీటి సమస్య ను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కాలనీ, అంబేడ్కర్‌కాలనీ, చెన్నకేశవకాలనీల్లో ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
యాడికి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలో తాగునీటి సమస్య ను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కాలనీ, అంబేడ్కర్‌కాలనీ, చెన్నకేశవకాలనీల్లో ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కాలనీల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత స్తంభాలు ఏర్పాటు చేయాలని, అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీల వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఆయన సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను 24గంటలలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి సమస్య ఎక్కడెక్కడ ఉందో పరిశీలిస్తామని, అనంతరం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్నినెలల సమయం ఇస్తే తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ ప్రతా్‌పరెడ్డి, ఎంపీడీఓ వీర్రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ దేవకుమార్, హౌసింగ్ ఏఈ లోకే్‌షకుమార్, ట్రాన్సకో ఏఈ రాజారావు, వెలుగు ఏపీఎం చంద్రశేఖర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి, పంచాయతీ కార్యదర్శి అశ్వర్థనాయుడు, సర్పంచ అనురాధ, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jan 18 , 2025 | 12:06 AM