ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NTR చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌

ABN, Publish Date - Jan 19 , 2025 | 02:00 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. ఆయన 29వ వర్ధంతి సభలను శనివారం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో వాడవాడలా నిర్వహించారు.

-వర్ధంతి సభలో వక్తలు ఫ వాడ వాడలా ఘన నివాళి

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. ఆయన 29వ వర్ధంతి సభలను శనివారం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో వాడవాడలా నిర్వహించారు.


ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నందమూరి అభిమానులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ కారణజన్ముడని, సినీ, రాజకీయ రంగాల్లో తిరుగు లేని కీర్తిని గడించారని కొనియాడారు. తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు అనేక సేవలందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేయారని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సందర్భంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలను, అన్నదాలను నిర్వహించారు. పలు ఆస్పత్రులలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 19 , 2025 | 02:00 AM