Sp rathna సవాళ్లను అధిగమిస్తేనే సాధికారత: ఎస్పీ
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:38 PM
ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాఽధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని జిల్లా ఎస్పీ రత్న ఉద్ఘాటించారు. 8న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక సాయిఆరామంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, అదినారాయణ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై గురువారం జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి) ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాఽధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని జిల్లా ఎస్పీ రత్న ఉద్ఘాటించారు. 8న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక సాయిఆరామంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, అదినారాయణ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై గురువారం జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమను తాము నిరూపించుకోవాలని తలెత్తుకుని బయటకు వస్తారో అక్కడి నుంచి అనేక ఆటంకాలు ఎదురవుతాయన్నారు. వాటన్నింటినీ సవాళ్లుగా మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అనంతరం బాల్యవివాహాలు, లింగ వివక్షపై పోస్టర్లను ఎస్పీ విడుదల చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఐదుగురు మహిళలను సత్కరించారు, ఆర్డీటీ సహకారంతో 52 మంది ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ ప్రమీలాకుమారి, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 11:38 PM