COLLECTOR: మహిళా సాధికారతతోనే స్వావలంబన
ABN, Publish Date - Mar 02 , 2025 | 12:24 AM
మహిళా సాధికారతతోనే స్వావలంబన సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. స్థానిక ్లకలెక్టరేట్‌లో శనివారం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
పుట్టపర్తిటౌన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతతోనే స్వావలంబన సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. స్థానిక ్లకలెక్టరేట్‌లో శనివారం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా వనరులు, నాయకత్వ లక్షణాలు పెంపొందించు కునేందుకు అవకాశాలు కల్పించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాలు మార్చి 1నుండి 8వతేదీ వరకు జరుగుతాయన్నారు. ర్యాలీ గణేష్ కూడలి వరకు కొనసాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి ప్రతిఒక్కరూ బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం, సీడీపీఓ గాయత్రి, పలువురు అదికారులు పాల్గొన్నారు.
Updated Date - Mar 02 , 2025 | 12:24 AM