COLLECTOR: వేగవంతంగా భూసేకరణ
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:05 AM
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎనహెచ 342, ఎనహెచ 716-జి తో పాటు వివిధ జాతీయ రహదారుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష
పుట్టపర్తి టౌన, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎనహెచ 342, ఎనహెచ 716-జి తో పాటు వివిధ జాతీయ రహదారుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల నిర్మాణాల కోసం సేకరించిన భూమికి సంబంధించిన రైతులకు చెల్లించిన నష్టపరిహారం గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతి, పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. బుచ్చయ్యగారిపల్లి వద్ద అదనపు భూమి సేకరణపై దృష్టి పెట్టాలని స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సూర్యనారాయణరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్ జయశ్రీ, ఆర్డీఓలు వీవీఎస్ శర్మ, ఆనంద్ కుమార్, సువర్ణ, మహేష్, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అదే వి ధంగా పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ పనులు చేపడుతున్నామన్నారు. మడకశిర, ఆర్. అనంతపురం, గౌడనహల్లి నందు పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారథి, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ సోనీ సహానీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 28 , 2025 | 12:05 AM