EX MINISTER PALLE: రైతులకు నాణ్యమైన విద్యుత అందించాలి
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:06 AM
రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత అందించాలని విద్యుత అధికారులకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ప్రజాసమస్యల పరిస్కారం కోసమే తెలుగుదేశంపార్టీ ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత అందించాలని విద్యుత అధికారులకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ప్రజాసమస్యల పరిస్కారం కోసమే తెలుగుదేశంపార్టీ ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి ప్రజాదర్బార్ నిర్వహించగా పలు సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వ్యక్తిగత కారణాలతో హాజరుకాకపోవడంతో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. నియోజకవర్గంలోని రైతులు నాణ్యమైన విద్యుతను అందించాలని, సకాలంలో ట్రాన్సఫార్మర్లను అందచేయాలని ఫిర్యాదుచేశారు. వృద్ధులు వితంతువులు, మహిళలు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదని త్వరగా మంజూరు చేయించాలని కోరారు. గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత, సీసీరోడ్లు, ఇంటిపట్టాలు మంజూరు చేయాలని ప్రజలు విన్నవించారు. 128 ఫిర్యాదులను మాజీమంత్రి స్వీకరించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని పల్లె వారికి హామీ ఇచ్చారు. 15 రోజులకొకసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తానని అన్నారు. విజయ్‌కుమార్, మల్లిరెడ్డి, మైలేశంకర్, సామకోటి అదినారాయణ, రామారావు, శ్రీరాంనాయక్, చెన్నకేశవులు, కేశవ్‌నాయుడు, శ్రీరామ్‌రెడ్డి, అదినారాయణరెడ్డి, బొమ్మయ్య, పుల్లప్ప, నాగరాజు, సలాంఖాన పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:06 AM