ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

COLLECTOR: అర్జీలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

ABN, Publish Date - Jan 06 , 2025 | 11:53 PM

ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల విషయంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టీఎస్‌ చేతన హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 215 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు.

The Collector is aware of listening to people's problems

పుట్టపర్తిటౌన, జనవరి6(ఆంధ్రజ్యోతి): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల విషయంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టీఎస్‌ చేతన హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 215 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్జీని సంబఽధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ప్రధానమంత్రి జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియానను జిల్లాలోని సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు తండా, తనకల్లు మండలం ముండ్లవారిపల్లి తండా, గాండ్లపెంట మండలం తుమ్మలబైలు గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. సంక్రాంతి తరువాత జిల్లాలో ఎస్సీ కమిషన పర్యటన ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు నివేదికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షమ శాఖాఽధికారి నిర్మలాజ్యోతి.. వార్డెన్లు, సిబ్బందిని వేధించి డబ్బు వసూలు చేస్తున్నారనీ, ఆమెపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర.. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌, డీఆర్వో విజయసారధి, ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా వైద్యాధికారి ఫిరోజాబేగం, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

డీపీఓలో..

పుట్టపర్తిరూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 41 అర్జీలు అందాయి. వాటిని ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోనలో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో ఉన్న వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సమష్టి కృషితో కుష్ఠు నిర్మూలన

అఽధికారులు, వైద్యసిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితో జిల్లాలో కుష్ఠువ్యాఽధిని నిర్మూలించవచ్చని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కుష్ఠు వాఽ్యధి నిర్మూలన పోస్టర్లను కలెక్టర్‌ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కుష్ఠువ్యాధి నిర్ధారణకు ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి కుష్ఠువ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందిస్తామన్నారు. 6 నుంచి 12 నెలలపాటు చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి ఫిరోజాబేగం, జిల్లా కుష్ఠు నివారణాధికారి డాక్టర్‌ తిప్పయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:53 PM