ఆకట్టుకున్నవైజ్ఞానికి ప్రదర్శన
ABN, Publish Date - Feb 24 , 2025 | 11:44 PM
స్థానిక విశ్వభారతి పాఠశాలలో సోమవారం విద్యార్థులు సైన్స వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వారు తయారు చేసిన పలు నమూనాలను ప్రదర్శించారు
ముదిగుబ్బ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): స్థానిక విశ్వభారతి పాఠశాలలో సోమవారం విద్యార్థులు సైన్స వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వారు తయారు చేసిన పలు నమూనాలను ప్రదర్శించారు. మొదటి, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. అంతేకాకుండా సైన్స నమూనాలు తయారు చేసిన ప్రతి విద్యార్థికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వేమనారాయణ, విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్ సింగారెడ్డి, డైరెక్టర్ చంద్రహా్‌సరెడ్డి, చంద్రశేఖర్, సాయినాథ్‌రెడ్డి, బాలాజీకుమార్, చిందంబరరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - Feb 24 , 2025 | 11:44 PM