అలరించిన ధర్మవరం కళాకారుల నాట్యప్రదర్శన
ABN, Publish Date - Jan 31 , 2025 | 12:20 AM
శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 28,29 తేదీల్లో ధర్మప తంలోని బ్రాహ్మరి వేదికపై నిర్వహించిన నాట్యప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
నాట్యప్రదర్శనలో ప్రతిభ కనబరచిన ధర్మవరం కళాకారులు
ధర్మవరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 28,29 తేదీల్లో ధర్మప తంలోని బ్రాహ్మరి వేదికపై నిర్వహించిన నాట్యప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ధర్మవరానికి చెందిన శ్రీలలిత నాట్య కళానికేతన నాట్యగురువులు బాబూబాలాజీ, కమలాబాలాజీ శిష్యబృందం శివనామనృత్యం, దేవి నాట్యం ప్రదర్శించారు. అదేవిధంగా రామ లాలిత్య, హర్షశ్రీలు చేసిన జంట నాట్యంతో ప్రేక్షకులను తన్మయం చేశారు. దీంతో ధర్మవరం నాట్యకళాకారులకు ఆలయ పీఆర్‌ఓ శివారెడ్డి సర్టిఫికెట్స్, జ్ఞాపికలను అందజేశారు.
Updated Date - Jan 31 , 2025 | 12:20 AM