ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2.77 ఎకరాల భూమి కబ్జా చేశారు

ABN, Publish Date - Feb 18 , 2025 | 12:37 AM

ఆదోని పట్టణ శివారులోని మండిగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 447లో 2.77 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని వెంకన్నపేటకు చెందిన మల్లికార్జున, నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఎమ్మెల్యేతో మొరపెట్టుకుంటున్న బాధితులు

న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు బాధితుల మొర

ఆదోని, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ శివారులోని మండిగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 447లో 2.77 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని వెంకన్నపేటకు చెందిన మల్లికార్జున, నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యే పార్థసారథిని సోమవారం ఆదోనిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మొరపెట్టుకున్నారు. తమకు తాతముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన చేసుకున్నారని తెలిపారు. ప్రస్తు తం ఈ స్థలం విలువ రూ.20 కోట్లు పైగా ఉందని చెప్పారు.

భూ కబ్జాదారులను వదిలిపెట్టం: ఎమ్మెల్యే పార్థసారథి

భూ కబ్జాదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరించారు. ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఉన్న జయరాంరెడ్డి అనే వ్యక్తి అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డికి తొత్తుగా మారి అక్రమాలకు పాల్పడ్డాడని మండిపడ్డారు. ఆదోని డివిజనలో జయరామిరెడ్డి బాధితులు అనేకమంది ఉన్నారని, వారందరూ సబ్‌ కలెక్టర్‌కు ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేస్తే పేర్లు బయట పెట్టకుండా విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. సర్వే నెంబరు 447పై పూర్తి అయ్యేదాకా మరొకరికి రిజిస్ట్రేషన చేయవద్దని కలెక్టర్‌తో పాటు జిల్లా రిజిసా్ట్రర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఆదోనిలో ఉన్న విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన చేసుకొని, ఆ తరువాత ఆ పొలాన్ని మరొకరికి విక్రయిస్తున్నారని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో భూ మాఫియా రాజ్యమేలిందని, ఎవరి భూ ములు ఆక్రమించుకున్నారో వారందరూ తనకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ పలుకుబడితో కబ్జాలు చేశారని, ఇప్పటి వరకు 30మంది కబ్జాదారుల పేర్లు బయట పెట్టారని చెప్పారు. మరో 60 నుంచి 70 మంది వరకు భూ కబ్జాదారులు ఉన్నట్లు సమాచారం ఉందని, వారి వివరాలు కడా సేకరిస్తున్నట్లు తెలిపారు. వారు కబ్జాలకు ఎక్కడ పాల్పడ్డారో పూర్తి వివరాలతో బయట పెడతానన్నారు. ప్రస్తుతం సర్వే నెం.447లో ఉన్న 2.77 ఎకరాలను కార్వన పేటకుచెందిన కత్తి రవి అనే వ్యక్తిపై రిజిస్ర్టేషన అయ్యిందని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఇలా మరొకరికి రిజిస్ర్టేషన చేయడంపైన కూడా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ కురువ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, మధు, ఉపేంద్ర, నాగరాజుగౌడ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:37 AM